వెండిచీర:

వెండిచీర:

ఈ ఉదయము అట్లాంటా నగరము వెండి చీరను సింగారించుకుంది-
హరి నివాస పాలసంద్రము పొంగిపొరలి వచ్చినట్లుంది-
కైలాసపు హరుని శిరస్సు నుంచి జాలువారిన గంగ హిమమును తోడు తెచ్చుకున్నట్లుంది-


మార్గశిర పౌర్ణమి వెన్నెలలు తెరలు తెరలుగా పరుచుకున్నట్లుంది-


పండు ముతైదువ పండుగకోసం వరిపిండి ఆరబోసినట్లుంది-


మల్లెల వనమంతా ఓక్కసారిగా గుప్పున విచ్చికున్నట్లుంది-


పత్తి పంటకాపుకొచ్చినట్లుంది-


కుండలోని గడ్డపెరుగు గలగల నవ్వినట్లుంది-


ఆకులురాలిన చెట్లను మంచు ఏంజిల్స వచ్చి పరామర్శించినట్లుంది-


ఆకాశము నుంచి హంసలు బారులు బారులుగా స్వర్గం నుంచి దిగి వస్తున్నట్లుగా వుంది-


జలజలా కురుస్తోంది ఈ తుషారపు జల్లు


అవనంతా పరచుకుంది ఈ శ్వేతపు హరివిల్లు.


అట్లాంటా నగరము వెండి చీరను సింగారించుకుంది ఈ ఉదయము-

సంధ్యా యల్లాప్రగడ
12/8/2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s