ఈ సారి స్వామి వారి అమెరికా పర్యటనలో అట్లాంటా నగరము చోటు చేసుకొనలేదు. అది ఎందుకో తప్పిపోయింది. వారు నార్త్, సౌంతు కెరోలినా వరకూ వస్తున్నారు. కాని ప్రక్కనే వున్న అట్లాంటాకు రావటం లేదు. నా భావాలు వర్ణానాతీతాలు. స్వామి ఇక్కడ దాకా వచ్చిన వెళ్ళి దర్శించుకోలేని నా నిసహయతకు నామీద నాకు చిరాకువేసింది. సర్వ సమర్దుడైన పరమాత్మ శ్రీ శ్రీ పరమహంస పరివాజ్రకులైన స్వామి వేంచేస్తుంటే వెళ్ళలేని నా అసహయతను నా స్వామి పాదుకలుకు విన్నపించుకోవటం తప్ప ఏమీ చేయ్యలేక పోయాను. మిత్రులు ఎంతో చెప్పారు చూడండి. ట్రై చేయ్యండి అని. అంత కుదిరితే నేనుంటానా ?గురుదేవులు కదలి వస్తుంటే. కాని నాకు సంసార గుంజాటమున కుదరదు. నా భక్తి నా గురువు యందు నిజమైనదైతే నాకు వారు దర్శనము తప్పక కలుగుతుంది అని అను కున్నాను.
“ధ్యాంక్సుగివింగు” శుక్రవారము మధ్యహానము 3 గంటలకు మెసేజ్ స్వామి హుస్టన్ వెళ్ళుతూ దారిలో అట్లాంటాలో చాలా కొద్ది సమయము (1/2 గంట) ఆగుతారని. రమ్మని. ఆ క్షణము నుంచి నాకు శ్వాస ఆగిపోయింది. నమ్మలేక పోయాను. ఆరు కల్లా హుటాహుటి రవి గారి ఇంటిలో వాలిపోయాను. స్వామి వచ్చారు. జెట వారి నివేదన, తర్వాత వీటి సేవ అట్లాంటా నివేదన నివేదించాము.
స్వామి ” బాగా చెస్తున్నారమ్మా” అని మంగళాశాసనాలు ఇచ్చి మంత్రాక్షితలు ఇచ్చి దీవించారు. గురుదేవుల ఆసీస్సుల కంటే ఇంక కావలసినది ఏముంది. సదా వారి పాదములపై స్తిరమైన గురుభక్తి కోరుకోవటము తప్ప. స్వామి సాగిపోయారు. తేరులా వారి రధము వెళ్ళిన తరువాత కూడా నా భావోద్రేకాలు ఆగక నా మనసు లో చెలరేగినది ఈ కవనము.
స్వామి పాదాలకు సమర్పించిన పుష్పము.
—————–
॥ మా చిన్నజీయ్యరు స్వామి ॥
1.మేము భక్త శబరిలము కాక పోయినా,
శ్రీరాముని వల్లె కదలి వచ్చారు స్వామి।
కోదండము వలె త్రిదండమును చేతపూని మము ఆదుకొన వలెననే॥
2.మేము విదురులము కాకపోయినా ,
శ్రీ కృష్ణని వలె నడచి వచ్చారు స్వామి ।మమ్ము అనుగ్రహయించవలెననే॥
3.మేము ప్రహల్లాదుడు కాకపోయినా ,
మమ్ము రక్షంప వెడలి వచ్చారు స్వామి
నృసింమునిలా వలనెనే ॥
4.జడులైమయి, సామాన్యమైననూ మమ్ము సంరక్షింప తరలి వచ్చారు స్వామి త్రివిక్రమువలనె ॥
5. అజ్ఞానులమైన మమ్ము జ్ఞానమోసగి,
ఆదుకొన వచ్చారు స్వామి హయగ్రీవుని వలెనె॥
6. మేము గజేంద్రునివలే ఆత్మగోష చేయ్యలేకపోయినా పరుగున వచ్చారు స్వామి నారయణుని వలననే॥
7. ఆత్మజ్ఞానమొసగ అట్లాంటా పయనమై వచ్చారు స్వామి అపర రామానుజుని వలనే ॥
8. మా భక్తి పారిజాతములను గ్రహించి,
మము అనుగ్రహించ వేగి వచ్చారు భక్త సులభులైన, మా చిన్నజీయ్యరు స్వామి అయి॥
అనేక దాసోహములతో
సంధ్యా యల్లాప్రగడ