అమెరికా లో ఆవకాయ
———————
నేను సైతం
అమెరికాలో మామిడికాయను కొని తెచ్చాను..
విందు లో వాడాలని, పసందుగా బోంచేయ్యా లని,
తెచ్చిన కాయని ముక్కలుగా తరిగాను, చెక్కలను వేరు చేశాను..
ట్రంప్ మీద కోపాన్ని కారంగా మార్చాను
ఎర్రటి కారాని వేశాను ఒక తూకాన,
చేతయి చేతకాని ఆవేశంలా మిగిలిన తెల్లని ఉప్పును అదే చేత్తో వేశాను…
వడ్డించా ఘాటుగా రెండేసి చెంచాల
ఆవాలు పిండిలా మార్చి, H 1 ఉద్యోగి వీసా సమస్యను..
H 4 వీసాల రోసాల మాదిరి అదే తీరున వేసాను మరి రెండు చెంచాలు మొంతులు పిండిలా ,
ఆపైన కలిపాను OPT విద్యార్థుల వీసాల సమస్య లా నిండుగా ఆ కొలతతో నూనెను
చివరికి కొంచమైనా ఘాటుగా వడ్డించా గ్రీకార్డ్ క్యూ లా చిటికెడు ఇంగువ
నేను సైతం
అమెరికాలో ఆవకాయ కలిపాను
తెలుగోడి రోషంలా ఘాటుగా, కటువుగా యెఱ్ఱగా
నేను సైతం… నేను సైతం।
(సరదాగా కాసేపు)
