కాలిబాట- పరుగుల మూట
ఈ దారి ఎన్ని కాలాలని దాచినదో,
ఎందరి యవ్వనాలని చూచినదో
ఎందరి ఆనందాలలో మురిసినదో
ఎందరి భారాలను మోసినదో
ఎందరి కన్నీరు తుడిచినదో
ఎందరి హృదయాలని తేలిక పరిచినదో
ఎన్ని రంగులు మారినదో
ఎన్ని తరాలని పలకరించినదో
ఇది
హరితముతో నిండి,
హరిణాలతో కూడి
బిగ్ క్రీక్ నది వెంట నేలమీద పాకుతూ
వంతెనల క్రిందుగా
వంతెనలు కలుపుతూ
అల్లనల్లన సాగె
అల్ఫారెట్ట కాలిబాట
మా పరుగుల మూట.


