ముడి పెసలు కడు ఒడుపుగా తెచ్చి
ముచ్చటగా ముందు రోజు నానపోసి
ముసలం లేని యంత్రమున పిండి గావించి
మరునాడు ఉదయం పెనము సిద్ధం చేసి
ముచ్చటగా ఆ పెనం మీద
మూడు చుట్టులా పిండి తిప్పి
మిర్చి, ఉల్లి క్యారటు మరియు జీలకఱ్ఱయు చల్లి
మురిపముగా తీసి వడ్డించగా
మగడు మురిసెను
మోము మెరిసెను,
ముక్తి తీర ఆనందముగా గానము చేసేనిట్లు
“అల్లం పచ్చిమిర్చి జీలకఱ్ఱ చల్లి
నాకు నచ్చేటట్లు
మా ఆవిడా వేసింది ఒక పెసరట్టు
వారేవా ఏమి టెస్టు
ఓహో ఇది సూపర్ హిట్టు”
ఇదండీ ఈ ఉదయం మా వంటింటి సరిగమలు.
TGIFriday👍
👍
