రామ శబ్దం

రామ శబ్దం కడు  పవిత్రం

‘రామ-రామ’ అనగానే అంతరించు అజ్ఞానం
రామాయణము అది జీవన ప్రగతికి మూలం-
తరచి చూడగా నది   ప్రతీకాత్మ సమ్మేళం…
జీవుని జీవిత సమరం..
కౌసల్య దశరథులు – రాముని మాతాపితురులగా,
పంచకర్మేంద్రియ గుణము తత్త్వముల గుర్తులు,
ప్రతివారికి తమ మీద అపరిమిత ప్రేమ కదా
రాముడన్ననది  ఆత్మ-
మనలోని పరమాత్మ
నందుకే రాముడు చూడగ-
సర్వ జన ప్రియధాముడు !
సీత యన్న బుద్ది తోడ వివాహము జరిగెను
యుక్తాయుక్తములే లక్ష్మణ స్వామికి గురుతులుఉచ్ఛ్వాస నిశ్వాసలు హనుమ కు ప్రతి రూపాలు,
ప్రాణవాయువది సర్వుల జీవన  ఆలంబంనం!
అందుకె నయ్యను హనుమ -వాయువుకు తనయుడు
అహం అన్న అసురుడు – రావణ నామధేయుడు
అహం బలిసి నంతనే  బుద్ది తిరోగమనం సహజం…
హనుమ ఆగమనం సీతకు తీరును దుఃఖం
ప్రాణాపానయోగములతో బుద్దిని ఆత్మతో కలుప
అహం అంతరించు – ఆత్మ దర్శించును….
పరమాత్మ తత్త్వం మిగుల బోధపడును –
హనుమ ముక్తి దాయకం…
మానవ ప్రగతికి మూలం –
రామాయణమే సర్వామోద జన ప్రియం!
రామ రామ యనగానే అంతరించు అజ్ఞానం (ఒక ప్రవచనం విన్న తర్వాత తట్టిన ఊహ )

– సంధ్య యల్లాప్రగడ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s