రవ్వ దోశ పెళ్ల పెళ్ల ,తింటే కరకర
ఈ సమూహం లో చేరాక ఏవైనా కొత్త వంటకాలు నేర్చుకో వచ్చుగా అని ఆశతో మీరంతా గుమగుమతో అదర గొట్టేస్త్తున్నారు. నీకు పెద్దగా వంటల రకాలు రావు..వచ్చినతవరకు పంచుకోవాలనే ఉబలాటం తప్ప……
అందుకే బాగా త్రీవ్రంగా అలోచించి, ఛంట్టబ్బాయి లో శ్రీలక్ష్మి ని ప్రార్ధన చేసి చేసిన “రవ్వ దోశ పెళ్ల పెళ్ల , తింటే కరకర” మీ కోసం అందిస్తున్నా. .
కావలసిన సరుకులు:
ఒక గ్లాస్ దోష మిక్స్ లేదా రవ్వ మైదా సమన పరిమాణం,
ఒక రెండు చెంచాలు తురిమిన క్యారట్, ఉల్లి, మిర్చి, కొబ్బరి, జీల కఱ్ఱ, మరియు మీకు నచ్చిన పదార్థములు,
2 చెంచాల పెరుగుతో కలిపి చిక్కటి మిశ్రమము తయారు చేసుకోవాలి .
దీనికి 15 నిముషాల తరువాత రెండు కప్పుల నీరు కలిపి పలచన చేయాలి.
పెనం బాగా వేడి చేసి నామీద నీరు చల్లితే బాంబులా పేలాలి , అప్పుడు పెనము సిద్ధమని గుర్తు అన్నమాట.
ఈ కలిపిన కూరగాయల సామాను యావత్తు కొద్దీ కొద్దిగా పెనమంతా పరిచి, గభాలున పిండి పెనమంతా చల్లాలి.
దోశ కి తిప్పినట్లు గరిట పుచ్చుకు బరబరా తిప్పకూడదు. అసలు పిండిని పెనమును మనం తాకకూడదు.పెనం మీద పిండి పోసి, గమ్మున చూస్తూ ఉండాలి… అలా ఒక వంద లెక్కెట్టక ఈ రంద్రాలు తో కూడిన రవ్వ దోష పెనము నుంచి వేరు బడుతుంది.
దాని తిప్పి ఒక 2 నిముషాలు చూసి ప్లేట్ లోకి మార్చి ఏదైనా చట్నీ తో లేదా ఉరగాయతో, వడ్డించండి.
తిన్నవారు వహ్వా అంటూ వైకుంఠ నాధుని తలుచుకొని మిమ్ముల్ని ఆశీర్వదిస్తారు.
మీరు మాత్రం ఈ సమూహంలో ఏదైనా కొత్త వంటకం పోస్ట్ చేయండి.
పర్లేదు మన శ్రీలక్ష్మిలా బంగాళా బో బో కానీ అరటికాయ లంబా లంబా అయినా పర్లేదు సుమండీ!!
Happy cooking