నీవు
కటిక చీకటిలో తచ్చాడుతుంటే
ఒక చిరుదివ్వెనైనాను
గ్రీష్మంలా వేగిపోతుంటే
చిన్ని శీతల పవనమైనాను
శిశిరం లా రాలిపోతుంటే
వసంతమై తిరిగొచ్చాను
కఠిన పాషాణం ల శిధిలమైపోతుంటే
ఒక శిల్పమై స్వరాగాలు పలికించాను
మంచుబిందువులా కరిగిపోతుంటే
వసుధ నయి వడ్డిపట్టాను
అలవై చెదిరిపోతుంటే
చెలియలి కట్టనై చెంత నిలిచాను
మౌనమై శూన్యం లోకి జారిపోతుంటే
మౌనిలా నీలో అర్ధనై పరమార్ధమై నిలిచాను!!
– సంధ్యా యల్లాప్రగడ