మాయ

మాయ :

కనుల ముందు పంచ రంగులు వెలసిపోవు 

ఈ రంగలోక మాయ

సంపాదించిన ధనం తరగిపోవు
ఈ సంపదోక మాయ
నేటి యవ్వన పొగ్గు రేపు కరిగి పోవు
ఈ యౌవనమొక మాయ
నేటి బంధాలు రేపు చెదిరిపోవు
ఈ బంధాలోకమయ
నేటి రాజ దర్పం రేపు వేరొకరిదవును
ఈ వ్యవహారమొక మాయ
నేటి వెలుగులు రేపు చీకటవును
ఈ రేపగలోక మాయ
క్షణ క్షణపు జీవితం నిలువు మాయ
మాయలకు మాయ ఈ జీవితం ఒక మాయ
మాయ అన్నది కూడా పెద్ద మాయ
ఎంత జీవితమున్నదో ఎవరికెరుక –
ముక్తి ప్రదాయిని తల్లి జ్ఞానమోసగు
నిలుపు నీ పాదములు నా మనమునందు
మాయ లన్నియు మాయమౌను నీ కడ కంటి చూపు  తొడ
అమ్మలగన్నయమ్మ మాయమ్మ ,గౌరమ్మ
నీ దయ నిలుపు మాపై
-సంధ్యా యల్లాప్రగడ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s