ఓంకార రూపిణీ మాతా, మలయాచలవాసినీ,
సర్వ జగద్రాత్రి ప్రథమ సోపానముల
సాదనల సాధ్వి, లలనా మయూరి,
శ్రీ చక్ర సందాయిని పాహిమాం।।
ఐంకార రూపిణీ, వాగ్దేవి, శుద్ధ సాత్వికే జనని,
వేద సంభూతిని, సమరస సంగీత
సంజ్ఞాతిని పాహిమాం।।
హ్రీంకార రూపిణీ, కర్మద్వంసినీ,
అజ్ఞానాసురాంతకి, దేవి,
సింహవాహిని, జ్ఞానప్రథాయిని పాహిమాం ।।
క్లీంకార రూపిణీ నీశ్వరీ, త్రిగుణీ,
కామేశ్వరి, కామ సందాయిని, భగవతి,
సర్వ లోకైక పావనీ పాహిమాం।।
– సంధ్యా యల్లాప్రగడ