ఆది శంకరులు – అపర శంకరులు
అధ్వైతం ప్రతిపాదించి
నలుమూలలా, అణువణువుగా భారతావని యంతటా
వ్యాప్తి చేసిన ఉద్ధారకులు!
వింత వింత పోకడలతో
సనాతన ధర్మమునకు ముప్పు వాట్టిల్లు
సమయాన
సత్యదండం చేతబూని
జాతికి ధర్మభిక్ష చేసిన
సత్యవాది!
వేద, వేదాంగములకు, ఉపనిషత్తులకు
బ్రహ్మసూత్రాలకు
సరళ వ్యాఖ్యలతో భాష్యములు రాసి
జాతికి జ్ఞాన భిక్ష చేసిన
జ్ఞానవాది!
హిందూ దేశానికి నలుదిక్కూలా
నాలుగు మఠాలను దీపస్తంభములా నిలిపి,ధర్మ రక్షణకు
దిక్చూచి గా నిలచిన
ధర్మవాది!
సర్వ దేవతా, దేవి స్తోత్రములు రచించి
మానవాళికి అందించి,
ప్రజలకు భక్తి మార్గమను ముక్తి మార్గము చూపిన దయామూర్తి!
ఆధ్యాత్మిక భిక్ష ప్రసాదించిన కరుణామూర్తి.
బాలవటువుగా కనకధార కురిపించి
పేద స్త్రీ ని కాపాడి,
కనకధారను మానవజాతికి
అందించిన కారుణ్య మూర్తి
అపార కరుణా సాగరులు
అంధకారము తొలగించ వేంచేసిన జ్ఞాన భాస్కరుడు.
సకల లోకములు సమిష్ఠిగా పూజించబడు ఆదిగురువు.
32 సంవత్సరములకే అవతార పరిసమాప్తి చేసినా ,
వారి బోదనలు మనలను
నడుపుతున్న దివ్య జ్ఞానజ్యోతులు.
సంధ్యా యల్లాప్రగడ.