దిబ్బరొట్ట దోశగా మారిన వైనం- కృషితో నాస్తి దుర్భిక్షం:
మా ఇంట్లో దోశ పల్చగానూ, చక్కటి రుచితో రావటానికి ఒక దశాబ్ద కాలమే పట్టింది.
ఆ కాలంలో నేను పడిన తిప్పలు, అగచాట్లు అంత ఇంతా కావు. రాస్తే ఒక నవలైపోవునేమో. సినిమా తీస్తే జంధ్యాల వారి చిత్రంలా నవ్వుల హిట్ అయిఉండేది.
ఓంప్రథమములో అంటే పెళ్ళికి ముందు ఇంట్లో దోశలు అమ్మ వాళ్ళు వేస్తె తినటమే అలవాటు. పెళ్లి తర్వాత మొదటి నెలలో అత్తగారు వాళ్ళు వచ్చి నాతో ఉండి వంటలు గట్రా చూపించారు. అప్పుడు మొదటి రోజు ఆవిడా దోశల పిండి రెడీ చేయించారు.
శ్రీవారు ఆఫీస్కు వెళ్ళాలి టిఫిన్ పెట్టమంటే పెనం పెట్టి దోశ వెయ్యగానే అది పెనానికి అంటుకుపోయి, ఉండలు చుట్టుకో పోయి… నన్ను చూసి నవ్వి సిగ్గుపడి మద్దయిపోయ్యింది. ‘ఇలా ఇబ్బంది పేటేశాయి హేమిటి సేతును’ అని ఆలోచించి తెలివిగా అత్తగారినే వెసియ్యమని అడిగి నే చూస్తూ కాలక్షేపము చేశాను. తర్వాత ఎన్ని సార్లు చేసినా ప్రయత్నించినా, దోశ సిగ్గుల మొగ్గ, నాకు బొగ్గులు మిగిలేవి.. ఇలా కాదని సంధి చేసికుంటే లావుగా ముక్కలు ముక్కలు గానే వచ్చేవి.శ్రీవారు మాత్రము దంచినమ్మకు బొక్కిదే గతి అనుకునె వారెమో పాపము “పర్లేదు ఇవి కడుపులో ముక్కలు కావలసినవే గా” అంటూ తినేవాడు.
నా కష్టాలు చూసి చాల సార్లు మిత్రులు రకరకాల సలహాలు చెప్పేవారు.
అన్నం కలిపి పిండి రుబ్బుతే దోశ పల్చగా వస్తుంది అంటే ‘అలా ట్రై చేశాను. జిగురు ఎక్కువై మరింత అతుకుపోయాయి పెనానికి.
మెంతులు వేసి నానపెడితే పల్చగా వస్తాయి అంటే ఒక కప్పు మెంతులు కలిపి పప్పు రుబ్బి దోశ వేస్తె అసలే మందం దానికి తోడు చేదుగా కషాయ దోశయి కూర్చునేది.
అటుకులు కలపమని ఇంకొకరు సలహా ఇచ్చారు. అయినా ఫలించలేదు.
అసలు దోశకు నాకు ఏదో బద్ద శత్రుత్వమే ఉండి ఉంటుంది. అందుకే నన్ను ఇంతలా సతాయిస్తోంది అని అనిపించింది.నాకు వంట రాదని, దోశలు అస్సలు రావని తిర్మానించి శ్రీవారు ‘బత్రుకింతేనులే… నా దోశింతేనులే’ అని పాటలు పాడేవారు.
నాకు పట్టుదల ఇంకా పెరిగింది. ఉక్రోషము వచ్చింది. కానీ చెయ్యటానికి మార్గము లేదు.
ఇలా ఉండగా నాకు ఒక గొప్ప అవమానం జరిగి నాలో లోలో వున్న దోశ మీద కసి పెంచింది.
అదేంటంటే మా స్నేహితురాలు ఇంటికి ఒకసారి వెళ్ళాం. వాళ్ళు దోశలు చేసిపెట్టారు. అవి చక్కగా హోటల్ దోశలా ఉన్నాయి. రుచి కమ్మగా ఉన్నాయి. అవి చూసి మావారు ఆవిడకు నమస్కారాలు చేసి బొక్కబొర్లా పడి, పొర్లు దండాలు గట్రా చేసి….ఆహా! ఏమి రుచి ఏమి రుచి!. చేసిన చేయి అన్నపూర్ణ!. మీ ఫ్రెండ్ కి నేర్పించండి దిబ్బరొట్టి ని దోశ అని నన్ను హత్య చెయ్యాలని కుట్ర పన్నుతోంది అని ఎగతాళి చేశారు.
నేను జంధ్యాల వారి శ్రీలక్ష్మిలా కన్నీళ్లతో దోశను సాధించాలని ప్రతిన పునాను. తనని రెసిపీ ఏంటి అని అడిగితె చాల కుళ్ళు గల ఆవిడ ఏముంది ఒకటి కి మూడు బియ్యం అంటే అన్నది కానీ పూర్తి వివరాలు ఇవ్వలే.
నేను అప్పటి వరకు ఒకటికి రెండు వేసేదాని. సరే అని ఒకటికి మూడు వేసినా తపస్సు చేసి తన్నుకు చచ్చినా ఏమీ మార్పులేదు. నాకు చాలా నిరాశ కలిగింది.
ఎడారిలో జలపాతంలా,దారి తప్పిపోయిన పిల్లలకి దొరికిన అమ్మలా, ఆకలిగొన్నవారికి పరమాన్నములా సీమ నా నేస్తమైంది. తమిళియన్. చాల స్వచ్ఛమైన అమ్మాయి. ఆ అమ్మాయి చూడటానికి కొద్దిగా వేరే గా వుండేది. దానికి తోడు పైపై మెరుగులు వుండేవి కావు తనకి. వీళ్ళంతా తనని చాలా బనాయించేవారు. ఆమె నా అవస్థ చూసి చెప్పింది. ఒకటికి మూడు బియ్యం కానీ…. ఒకట్టున్నారా మామూలు బియ్యం ఒక్కటి ప్యారా బాయిల్డ్ రైస్ వేసుకో మని.
అంతే నండీ. నా జీవితములో సూపర్ రిన్ తళతళలే. ఇంక నేను వెనుతిరిగింది లేదు. నా దోశలు ఎంత పేరొచ్చాయంటే నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా అందరూ నన్ను దొశ వేసి పెట్టమని అడగకుండా వుండరు. నాకు మా అత్తగారింటో వున్నని రోజులు వుదయము దోశలే దొశలు.
మా వారు అత్యంత పలుచని నా దోశలు తిని మూర్చపోయి మాటమార్చి ‘నీవనుకున్నది సాదిస్తావులే …. మరి నా ఫెవరెట్ ……బ్లా బ్లా డిషో ‘ అంటే సరదాగా చెబుతూవుంటా ‘మళ్ళీ ఇంకొసారి అడగండి పెనము తో పాటూ అట్లకాడ కూడా వేడిగా చెస్తాను అని”. అదండి దోశ తో నా యద్ధము…. గెలుపు…..
మరొకసారి మరో రెసిపి కథతో మీముందుంటాను.
Happy cooking.
సంధ్యా యల్లాప్రగడ