ఇక్కడ- అక్కడ
భూదేవికి -వందనాలు:
పర్యావరణముపై అవగాహన కలిగిన తరువాత, మన ముందు తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణము అందించాలనే సత్సంకల్పముతో ఈ Earth-Day ను మొదలెట్టారు .
ఇప్పుడు ప్రపంచమంతా ఎదో సందడి జరిపే ఈ ఏప్రెల్ మూడవ ఆదివారము నాటికి మేము వాలంటీరు చేసే వీటీ సేవ తరుపున మేము Earth-Day లో పాల్గోన్నాము. ఆ సందర్భముగా నేను వెళ్ళిన పార్కు నిజానికి పార్కు కాదు. అది ఓక జాతీయ రిక్రియేషను కేంద్రము. టూకీగా చెప్పాలంటే మన అభయారణ్యం లాంటిది.
అమెరికాలో నాయ్యవ్యవస్థ చాలా కట్టుదిట్టంగా నడుస్తుంది. ఇక్కడ నగర ప్లానింగులో భాగంగా, ఉద్యానవనాలు, హరితము తప్పక వుండవలెను. అందుకే ఇంత అట్లాంటా మహానగరము నట్టనడిమిన వున్న ఈ పార్కు లో మనము ప్రకృతిని అత్యంత దగ్గర చూడొచ్చు, అనుభవించవచ్చు. జాతీయ ప్రభుత్వపు ప్రత్యక్షపర్యవేక్షణలో వుండే ఈ పార్కుకు 48 మైళ్ళ ‘చెట్టహూచ్చీ’ నదీ పరివాహకప్రాంతముంది. ఇక్కడ వున్న కాలి బాట ప్రక్కనే చెట్టు పుట్టలు మనకు దట్టమైన అడవిని గుర్తు చెస్తాయి. ఇక్కడ ఏదీ మనము తాకకూడదు కనుక, పడిపోయిన చెట్టును (దారికి అడ్డు లేకపోతే) సైతము అలానే వదిలేస్తారు. ఇక్కడ వున్న మూడు మైళ్ళ కాలిబాటను బాగుచెయ్యటానికి మేము ఈ ధరిత్రి దిన సందర్బముగా పాల్గోన్నాము. అక్కడ వున్న రేంజరు మాతో పాటు ఆడుతూ పాడుతూ నాలుగు గంటలు పని చేయించారు.
ముందు మాకు ఆ పని ముట్లు వాడకము గురించి వివరించి, వాన నీటికి ఆ కాలిబాట కొట్టుకు పోకుండా, ఎలా నీటి ప్రవాహమును ప్రక్కదారి పట్టించాలో చూపించారు. నాతో పాటూ మరో 20 మందిమి కలసి ఆ నాలుగు గంటలు ఆ గొడ్డలి , పార వంటి పనిముట్లతో కుస్తీ పట్టి పని పూర్తి చేశాము.
మా పని ముగిశాక, మాకు త్రాగటానికి నీరు ఇచ్చారు. మేము కొన్ని ఫోటోలు తీసుకొని పనిచేసిన సంతోషముతో, వంటి నొప్పులతో ఇంటికి తిరిగి వచ్చాము.
నాకు ఇప్పుడు మన భారతదేశములో మెుక్కల నాటటము గురించి తెలియదు కాని రెండేళ్ళ క్రితము, హరితహారము జరిగే సమయములో, అక్కడ వుండటము జరిగింది.
ప్రతి ఆఫీసరుకు కొన్ని మొక్కలు నాటించాల్సిన టార్గెటు ఇచ్చారు. వీళ్ళు వూరిమీద పడి(క్షమించాలి ఇంకో మంచి మాట వాడలేకపోతున్నందుకు) కనిపించిన ప్రతిచోట ఓక మొక్క నాటుకుంటూ ఆకరున, పోలాల వెంట, రోడ్డుప్రక్క చెట్ట క్రింద సైతము వదలక నాటారు. నాటామంటే నాటాము అన్న లెక్క న అన్నమాట! నిబద్ధత లోపించిన యంత్రాగము, హడవిడి మంత్రాగము వల్లనే కదా ఇలాంటివి జరుగుతాయి. ఇదే మనసు పెట్టి చేసివుంటే ఎంత బాగుందేది. ఈ పాటికి హరితము కవిపించేదిగా. ఆ మొక్కలకి ఆ తర్వాత ఎవరైనా నీళ్ళు పోశారా? అన్నది సందేహమే.
మనకు న్యాయవ్యవస్థ వుంది. చట్టాలు వున్నాయి. కాని వాటిని పాటించే నిబద్ధత ప్రజలలో, యంత్రాగములో లోపించినది అన్నది నిజము. నేటి యువత, విద్యతో పాటు ఎంత వివేకముగా ప్రవర్తిస్తున్నారన్నది ఆలోచించ వలసిన విషయము.
ప్రజలలో భాద్యతతో పాటు మనది ఇది అన్న భావన కలిగితే కాని మనకు నిజమైన ధరిత్రి రోజు కాదు. విధ్యతో పాటూ, నేటి యువతకు కొంత ‘మన’ అన్న భావన పెంచాలి. ఆ భావన కలిగిన తరువాత ఇక వారి ఇల్ల, వారి వీదే కాదు ప్రతిదీ రక్షించుకే వీరులు వీరంతా. అప్పుడు హైద్రాబాద్ లో కూడా మేము మాసవుదయపు నడక చక్కని పరిసరాలలో సాగించవచ్చ.
సంధ్యా యల్లాప్రగడ.




