వాణిని నమ్మితి
మృదుల గీతోత్పల మంజుల మృందగ సుశీల నాద విపంచి రవముల గానము చెయ్యగ
వాణిని నమ్మితి
సుమనోహర దృతుల సుశిత గంభీర ఝరుల కవనము రచియింపగ
వాణిని నమ్మితి
మోహన సావేరి పున్నాగవరాళి, సింధుభైరవి, తోడి లలో మృధు మధుర రాగాలాపనలతో వీణను మీటగ
వాణిని నమ్మితి
ప్రాక్దిశన వెలుగు బాలారుణ భాస్కర సుప్రకాశ జ్యోతుల యందు అమ్మను దర్శించి ప్రార్థన సేయ్యగ
వాణిని నమ్మితి
సకల చరాచరములలో జాగ్రుత్, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థల జీవుని యందు చిచ్ఛక్తి స్వరూపిణిగ వెలుగు అంబ అండను కోరి
వాణిని నమ్మితి
శ్రవణ,కీర్తన,స్మరణ, పాదసేవ నార్చన తోడ నాత్మ నివేదించి వందనమొనర్చిన బ్రోవు కృపావరిగ,
వాణిని నమ్మితి
జ్ఞాన జిజ్ఞానాసార్థులలో వివిద రూపములుగ మమ్ముల నడిపించు జ్ఞానప్రదాయినిగ
వాణిని నమ్మితి
పరా పశ్యంతి, మధ్యమా వైఖరిల వాక్కు స్థితులలో నరుని నడిపించు నావగ నిలుచు నాదస్వరూపిణిగ
వాణిని నమ్మితి
అణిమాధి సిద్దులలో, నవ నిధులు మించిన భోగివై మానవుల కాపాడు జనని నీశ్వరిగ
వాణిని నమ్మితి.-
సంధ్యా యల్లాప్రగడ.