చెలియలి కట్ట 

ఊరు వాడ, పుట్ట, చెట్టు,

వాన వరదై ఉప్పొంగుతున్నాయి

చలికి మెల్లగా పిల్ల గాలులు
నెమ్మదిగా బరువుగా ఈ గదిలో

తెలియని భయాలు
కనపడని గోడలు
వికటంగా నవ్వుతున్నాయి

సాధన భాదను వేదన
మాతృ వేదన, మరణ వేదన మానసిక వేదన

నీరవ నిర్జీవ ఉదయాలు
ఏ అంబికా దర్బారు బత్తి వెలిగించి
జీవం ఇవ్వాలి

దోమలు చీమలు చుట్టూ
అలుముకుంటున్నాయి
పేలు ప్రవహిస్తున్నాయి

వాడ బడుతున్నాను
సోపు లా – ఒక ఆడ సోపులా
మగ సోపులు, ఆడ సోపులు
చీపురు ఆడవారికి ఆవిష్కరించారు!??
ఆడవారు మాత్రమే చిమ్ముటకు అర్హులా ?

పురుషులు జాకెట్లు కుట్టుటకై పనికివస్తారు!

దేవుళ్ళు వేరు – నీ – నా దేవుళ్ళు
మనుష్యులంటే కండా బండా
దేనినైనా కొలిచే సాధనం డబ్బా
మనిషి సమయానికి, విలువలకి విలువేంటి?

వేదన చెందే హృదయానికి
స్వాంతన నిచ్చు చెయ్యి  విలువేంటి?

ఉద్యోగం చెయ్యని స్త్రీ సమయం ఎవ్వరింటి
చెత్త శుభ్రం చేయటానికి ?

జీవితాన్ని ప్రేమించాలి-
ఎవ్వరి జీవితాన్ని? నీదా ? నాదా ?
మనది కాదా?
అర్థం లేని భావాలకి అంతం లేదా

నాలుగు గోడల మధ్య
ద్వారాలు మూసుకున్న
ఆత్మకు వెలుగు ఎక్కడ నుంచి రావాలి

నా విలువలు ప్రశ్నించే నీ మేధ విలువేంటి?

చాలా ఉంది, చాలా ఉంది
గుండె లోతులలో నింపిన ఈ చెత్త

తుడిచేయి ఈ మురికిని
కడిగేయి  ఈ మరకని

కంటి క్రింద ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి కి
కనురెప్ప చెలియలి కట్ట

Sandhya Yellapragada

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s