ఉచ్శ్వాస నిశ్వాసల హంసను ఎక్కి
మనఃఫలకమున మంజుల వాణివి
జ్ఞానవాహినివి నీవు మాతా!
మూలాధారమున ‘ష్డజమ’ రూపపు మొగ్గవు
అనాహతం మీద ‘మద్యమ’మై,
విశుద్ధ లోన ‘పంచమ’ముగా పవళించి
సహస్రారమున ‘నిషాద’మైన నిలుచిన స్వరరాగ మాధురివి
సరిగమలతో హంస ప్రయాణం
సరస్వతికి స్వరాభిషేకం
నిలిపిన నిశ్చలముగా హంసను
నిలుపును జీవిని,నీరాజనంబు నొసగగ
సంగీతారాధనము జ్ఞానేశ్వరికి జరిపిన
మోక్షమునకు కది కదా సుగమము
సుమధుర కచ్ఛపి నాధమును
హృదయమున పలికించి,
హంసను అనుసంధానించి
అర్చింపు సాదనకు
జీవితము పండించు జనని భారతి
తవ పాద పంకజముల నాశ్రయించిన వారి
వెన్నంటి నడిపించును,
విజ్ఞానిగ వారు వెలగు,
పండితులుగా జన్మమది పండు!
సంధ్యా యల్లాప్రగడ