జొన్నవిత్తులతో కాసేపు:
తెలుగు భాషకు ఉన్న ఒక విశిష్ట ఆభరణం పద్యం. ఇతర భాషలకు లేనిది తెలుగుకు మాత్రమే సొంతమైనది పద్యమేనని పెద్దలంటారు.
మన తెలుగులో పద్యం మాత్రమే ప్రాచుర్యంలో ఉన్న రోజులలో పద్య వైభవం ఎంతో ఘనత కెక్కింది. రాయభార పద్యాలు ఇలా….వచనము, వచన కవిత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక, పద్యం కుంటుపడింది. అందునా కొందరు పెద్దవారు
“చందస్సుఅనేదుడ్డుకర్రలో,
పద్యాలనడ్డివిరుగగొడుదాం” –అనిచాటించిపద్యాలనుమూలకుతోసి
వచనముకోసంఆరాటపడ్డారు.
అలాంటిది ఈ కాలంలో కూడా అలవోకగా పద్యాలూ చెబుతూ, వంటికి అత్తరు పూసుకొన్నట్లుగా, పద్యాలనూ వంపుకొని, ఆ సౌందర్యం పంచుతూ ఈ వారమంతా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు అట్లాంటాలో విహరించారు. మాకు తెలుగు పద్య సౌందర్య మాధుర్యం పంచారు.
నాకు వారితో కొంత పూర్వ పరిచయం ఉన్నందున, వచ్చే ముందే చెప్పారు నాటా వారి సభలకు వస్తున్నామని. అట్లాంటాలో ఉన్న తెలంగాణా సంఘం వారి ఉత్సవాలకు వచ్చారు. ప్రతి రోజు విందులు ఈ వారమంతాను వారికి, పద్యాల విందు మాకు.
జొన్నవిత్తుల వారు పద్యాలే కాదు పేరడీలకు ప్రసిద్ధి. ఆయన ఆధునిక జరుక్ శాస్త్రి. అందరూ చూసే వుంటారు ఈ మధ్య యూట్యూబ్ లోను, వాట్సాప్ లోను వారివి పేరడీ పాటలు కోకాకోలలుగా . మాకు కొన్ని పేరడీ పాటలు కూడా వినిపించారు వారు.
తెలుగు భాషా అంటే ఆయనకు ఎంత ప్రేమో కదా!. ‘తెలుగు వేదం’ అని ఒక పద్య కావ్యం రచించారు. అందులోనే ‘అక్షర సరస్వతి గీతం’ అన్న పేర “అద్దమంటి ‘అ. ఆ’ లు అమ్మవారి చెక్కిళ్ళు…. ” అని సరస్వతి దేవి ని తెలుగు అక్షర మాలలో పోల్చుకు రాశారు. వారి తెలుగు వేదమంతా వారి భాషా మీద ప్రేమ ను చూపుతుంది. పద్యమన్నా, తెలుగన్నా ఆయన కున్న ప్రేమను మనకు ఉదాహరణలు ఎన్నో ఎన్నెనో.
పద్యంమన్నది మామిడి పళ్ళబుట్ట అని ఉదాహరిస్తారు. కాసేపు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది ఆయన పద్యం మీద తెలుగు మీద వున్న ప్రేమ ఎంతో.
శతక సాహిత్యం లో ఎంతో ఖుషి చేసిన జొన్నవిత్తుల వారు ఈ మధ్యనే ‘రామబాణమా!” అన్న మకుటముతో ఒక ‘రామబాణం శతకం’ రాశారు.
‘కోనసీమ’ మీద, ‘దివి సీమ’ మీద కూడా వారి శతకములున్నవి. “బతకమ్మ శతకం, తెలుగమ్మా శతకం” ఇత్యాదివి కూడా వారి రచనలే.
సింగరేణి బొగ్గు మీద కూడా శతకం లో బొగ్గు ను జీవితానికి అన్వయించి జీవిత తత్త్వాన్ని చూపించగా సత్తా ఉంది వారికి.
మచ్చుకి ఇది చుడండి :
“బొగ్గు రంగు నలుపు, భగ్గుమన్న ఎరుపు,/
భస్మమైన తెలుపు, భావమెరుగ / ప్రకటమౌనె సత్త్వ రాజస తామస /
శ్రీ త్రిమూర్తులుండే సింగరేణి !”
“నైమిశ వెంకటేశ్వరా శతకం, తెలుగు బాషా శతకం” కూడా వారి రచనలే.
జొన్నవిత్తుల వారి ‘కాఫీ దండకం’ అందరు వినే వుంటారు. వారు ఒక్క కప్పు కాఫీ కూడా తాగక, దాని రుచి గురించి సున్నితముగా వర్ణించటము విశేషము.
పద్యం రాయటమొక ఎత్తు. రాగయుక్తంగా పాడటము మరో ఎత్తు. ఆయన అద్భుతంగా రాయటమే కాదు, గంభీరమైన స్వరముతో పాడుతుంటే విన్నవారు పులకరించి పోవాల్సినదే.
వారు మా ఇంటికి వచ్చి మాతో వుండి ఒక పూట గడిపివెళ్ళారు.
మా హనీ అప్పుడు ఇంట్లోనే వుంది. దాని స్వచ్ఛమైన తెలుగు భాషకు ఆయన చాలా సంతోషపడ్డారు. దానికి వచ్చిన ప్రసిడెంటు మెడలును చూసి చాలా ఆనందించారు. పిల్లలందరూ హనీ ని చూసి నేర్చుకోవాలని పిల్లను దీవించారు.
నాకు వారి “లక్ష్మి కటాక్ష శతకము” కానుకగా ఇచ్చారు. (వారి శతకములు అన్నీ మిగిలినవి నా వద్ద పూర్వమే వున్నాయి)
ఇక్కడ వివిద కార్యక్రమములలో పాల్గొని వర్జినీయా వెళ్ళారు.
సంధ్యా యల్లాప్రగడ





బాష కాదండి భాష
LikeLike