అమెరికా అంటే మెల్టింగ్ పాట్. ఇక్కడ అంతా కలిసిపోతారని కదా ఆ పేరు. తమ ప్రతిభకు గుర్తింపు ఇచ్చే దేశంగా ప్రపంచంలో ప్రసిది కెక్కింది.
నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియని దేశం. కొలంబస్ భారతావనికి సముద్ర మార్గంకై వెతుకుతూ దారి తప్పి ఈ నేల మీద కాలు మోపాడు.
ఆయన వచ్చినప్పుడు, ఈ పచ్చని మైదానాలని, నదీజలాలను చూసి, భారతావని కి వచ్చానని తలచి, కనపడిన ఇచటి ప్రజలను భారతీయులనుకొని, ఇండియన్స్ అని నామకరణ చేసాడు.
తర్వాత ఇది భారత దేశం కాదని, ప్రపంచ పటం లో నాటి సామ్రాజ్యాలకు తెలియని కొత్త ప్రదేశమని తెలుసుకొని వలస రాజ్యాలు ప్రారంభించారు యూరపీయులు. ఇచ్చటి నేటివ్ అమెరికన్స్ తప్ప మిగిలిన వారు పూర్తిగా ఇమ్మిగ్రెంట్స్. వలసదారులు. కొంత ముందు, వెనకగా అంతా వలస వచ్చిన బాపత్తే. తమ ప్రతిభను పదర్శించుకున్నెందుకు వేదికగా ఈ దేశాన్ని మలచుకున్నారు.
కానీ నేటి రాజకీయ పరిణామాలలో వలసదారుల మీద “జీరో టలరెన్సు” అని సరిహద్దుల వద్ద కుటుంబాలని విడదీయటము మాత్రం హేయం. పరమ దుర్మార్గం. ఇది సహించరానిది. అంతా ముక్త కంఠంతో ఖండించ వలసిన విషయం.
నేడు ట్రంప్ ప్రభుత్వం నాటి హిట్లర్ కు, భ్రాతదేశంలో బ్రిటిష్ వారి హింసకు తక్కువ లేకుండా హింసిస్తున్నారు.
3 సంవత్సరాల క్రితం ట్రంప్ ఎలక్షన్ వేవ్ నడుస్తున్నప్పుడు నేను మిత్రులతో మామూలు చర్చలలో అడిగాను, ఎవ్వరికి ఓటు వెయ్యాలని, అప్పటి వారి సమాధానం నన్ను విస్మయ పరచింది…. “వదిలితే ఈ H1 వాళ్ళంతా దేశం మీద పడుతారు… వారికి ట్రంప్ అయితేనే సరి” అని. నాకు ఈ ప్రజల విపరీత ధోరణి వింతగా అనిపించింది. …”అంటే మనం కూడా అలాగే వచ్చాముగా మరి” అని అడిగితే… “వాళ్లకు మనకు తేడా లేదా ఏంటి” అని అడ్డంగా వాదన… తేడా ఏంటి? మనం కొంచం ముందు, వాళ్ళు తరువాత.. దానికే ఇంత అహంకరిస్తే , మరి నేటి బోర్డర్స్ దగ్గరి విషయం …. అంత ఆశ్చర్యం వెయ్యదుగా. నిన్న గాక మొన్న వచ్చిన ఈ భారతీయులకే అదీ తమ తోటి ప్రజలమీద కొంత కూడా సానుభూతి లేకుంటే, తాతల కాలంలో వచ్చి ఇక్కడ స్థిరపడి, ఈ దేశంలో వనరులు తనది మాత్రమే అంటుంటే అందులో ఆశ్చర్యం ఏముంది? ఇంకా అనుకునేదే ఏముంది?
మనిషిగా నిలవాలంటే మనకు కనీస గుణంగా మానవత్వం ఉండాలిగా. తన వారంటే పశు పక్షాదులలో వున్న కనీస కరుణ మానవులమైన మనకు మన ప్రక్క వారి మీద లేకపోతే ఎలా?
ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రతుకు బాగు పరచునే ఉదేశ్యం తో, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి సాహసించిన వలస వాదులకు, వారి పిల్లలని వాళ్ళ నుంచి దూరం చెయ్యటం, పిల్లలను ఫాస్టర్ హొమెస్ లో ఉంచి వారి జాడ కనపకుండా పోయినా బాధ్యతారహితంగా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసం?
మరొకరిని తమ వైపు కన్నెత్తి చూడకుండా ఉండటానికి ఇదో మార్గంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దారుణం కదా ఇది. వలసలు మాపుచెయ్యటానికి పన్నిన దారుణ పన్నాగం కదా ఇది?
ఇది పేదవారి మీద బలవంతుని బల ప్రదర్శన కాక ఇంకేంటి?
ప్రపంచంలో మార్పు సైన్స్ లో పురోగమిస్తూ ఉంటె, మానవత్వంతో తిరోగమిస్తూ ఉన్నది.
ప్రజాకంటకులు అనాదిగా వున్నారు … నేటికీ పుడుతూనే ఉన్నారు… ప్రజలను హింసిస్తూనే ఉన్నారు….. వాళ్ళ నాశనం ఎప్పుడూ వాళ్ళ కు రాసే ఉంటుంది… ఇందరి కన్నీళ్లకు కారణంమైన ఈ లోకకంటక పాలకులను మార్చుకోవాలని ఈ ప్రజలలో కనీసం ఆలోచన కలిగితే బాగుంది… ముందు ముందు
అన్నా కాస్త ప్రశాంతగా బ్రతకాలంటే ఓటు వేసే ముందు అంతా ఆలోచిస్తే మంచిది. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం వుండదు.
సంధ్యా యల్లాప్రగడ
అలనాడు యూదుల విషయంలౌ హిట్లర్ చేసిన దారుణాల ముఖ్య లక్షణం కాన్సంట్రేషన్ కేంప్ కి తరలించిన యూదులు ట్రెయిన్ దిగగానే వారిలో ఉన్న చిన్నపిల్లల్ని (లేబర్ గా పనికిరారనుకున్న ఇతరులతో సహా) వేరుచేసి అక్కడి నుండే సరాసరి గేస్ ఛాంబర్ కి తీసుకువెళ్ళడంట. ఇప్పుడు ట్రంప్ గారు సరిహద్దుల దగ్గరే విడదీసి గిడ్డంగులకి తరలిస్తున్నాడు.
కొంతమంది తాము చేస్తున్నది తమ దేశ శ్రేయస్సు కొరకే అని భ్రమ పడుతుంటారనుకుంటాను. లీలగా నిరంకుశ పోకడలా? సరే, ఇప్పుడు ఆపమన్నట్లున్నాడుగా ట్రంప్, కొంత నయం.
పైన మీరు చెప్పిన మనవారి చర్చల బట్టి చూస్తే … ట్రంప్ గారిని ఎన్నికల్లో సమర్ధించిన మనవారి ధోరణి ఎలా ఉందంటే … ఒకప్పుడు భారతదేశంలో రైలుప్రయాణాల్లో (రిజర్వేషన్లు రాకముందు కాలంలో)
తను బోగీ లోకి ఎక్కేసాక తరువాత స్టేషన్లలో ఎక్కేవారికి బోగీ తలుపులు తియ్యకుండా ఉండేవారు కదా, అలాగే ఉంది.
LikeLike
నరసింహారావు గారు, నమస్కారం. ట్రంప్ ఆపినా అందులో చాలా లొసుగులు ఉన్నాయి. ఆ చిహ్న్నపిల్లలను బోర్డర్స్ నించి తరలించారు. తల్లితండ్రులను వారికి కలిపే సమాచారం తప్పిపోయినదట?? హిట్లర్ పోకడలు చాలా ట్రంప్ లో ఉన్నాయి. మీడియా స్వేచ్ఛను హరించటం మొదలైనవి. అసలు హిట్లర్ కూడా ముందు ఎన్నికై తరువాత నియంతగా మారాడు. ఎక్కడి మన వారు మీరు చెప్పిన రైల్ ఉదాహరణ కన్నా ఇంకా ఘోరం. తిన్న నా పొట్ట కు శ్రీరామ రక్ష కన్నా పక్కోడు పోవాలి నేను మాత్రమే ఉండాలి అనే పరం కారాదు కట్టిన స్వార్థం… వీడు ఈ రోజు వీళ్ళని రేపు మనలని కొడతాడన్న ఇంగితం లేదు….
LikeLike
ఇవాళ్టి (25-జూన్-2018) Deccan Chronicle (Hyderabad Edition) మొదటి పేజ్ లో Counter Point అనే cartoon ట్రంప్ గురించి వచ్చింది. లింక్ ఈ క్రింద ఇస్తున్నాను, వీలయితే చూడండి. ట్రంప్ చేతల గురించి ఇతర దేశాల కామన్ మాన్ ఎలా భావిస్తున్నాడని ఒక సూచన అనుకోవచ్చు.
http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=10966853
LikeLike