నేను ఒక మిత్రుల ఇంటికి వెళ్ళాను.
రమ్మని, కూర్చోబెట్టి వద్దన్నా స్నాక్స్ ఇచ్చారు.
స్నాక్స్ తినకూడదు. తింటే ఒక ప్రమాదము వుంది. అదేమంటే తినటం మొదలెడితే అవి కంప్లీట్ చేసేవరకు ఆగలేము.
వాటికి తోడు ఆ చెక్కలు అవీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. చిన్నప్పుడు మధ్యాహనాలు అమ్మ చేసిన కారపూస సాయంత్రం బడి నుంచి వచ్చినప్పుడు తింటుంటే ఎలా ఉంటాయి…. అలా చాలా ఫ్రెష్ గా రుచిగా కమ్మగా వర్ణించటానికి నా దగ్గర మాటలు లేవు…. అలా తింటూ ఉండిపోయా…
బాగున్నాయి ఎప్పుడు చేశావంటే… చేసినవి కాదు… అవి “ఆహా” బ్రాండ్ అని తనే మొదలెట్టిన కొత్త బ్రాండు స్నాక్స్ అని వివరించారు. మరి ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యం లో నోరు వెళ్ళబెడితే చెపింది స్నేహ, చేసినవి వెంటనే ప్యాకింగు, షిప్పింగ్, ఆ రోజే వచ్చిన ప్రోడక్ట్ అవి, అంటే నాలుగు రోజుల క్రితంవి మనము బజారులో కొంటామన్నమాట! మరి అంత కమ్మగా ఉండక ఇంకెలా ఉంటాయి చెప్పండి?
పచ్చళ్ళు మొదలెట్టారని తెలుసు కానీ స్నాక్స్ గురించి తెలియదు నాకు.
అసలు మనకు బయటకు వెళితే గాలి కూడా స్వచ్ఛమైనది దొరకదు. వీళ్ళ సరుకంతా అన్ని ఆర్గానిక్. ప్రతి ముడి సరకు చాల శ్రద్దగా ఏరి, ఆర్గానిక్ వి చూసి, సర్టిఫై చేసుకున్న తర్వాత చేసిన పదార్థాలు, ఆ ప్రాసెసులో డాక్యుమెంట్ చేసి ప్రతిదీ చూపించాలి ప్రభుత్వానికి. అప్పుడే ‘ఆర్గానిక్’ అన్న గుర్తు ఇస్తారు కదా వాడుకోవటానికి.
విజయవాడ లోని వారి సొంత పొలాల్లో, తోటలలో పండిన మామిడి, అల్లం, చింతకాయలు, ఎండుమిర్చి ఒకటేమిటి ఎన్నో రకాలు పండించి దగ్గరుండి, ఎన్నిక చేసి తయారు చేయించిన పచ్చళ్ళు. చాలా చక్కగా, క్యూట్ గా ప్యాక్ చేయించారు.
వాళ్ళ లోగో కూడా స్నేహ కు ఇష్టమైన హంస మొకం అలలలా అలా అలా తేలిపోతూఉంది. నేను ఆనంద గారిని అడిగాను “ఆహా” ఏంటి ఆ బ్రాండ్ పేరు కారణము అని… ఆయన చెప్పిన సమాధానం ఎప్పటికి గుర్తుంది పోయేది.
“ఆనంద్ తో మొదలై ఏదైనా స్నేహ తో పూర్తికావాలండి” అని. అదే కదా స్నేహం అన్నా, బంధమన్నా.
మామిడి తాండ్ర గురించి చెప్పక పొతే నేను మామిడి పళ్ళ ఫ్యాన్ అవను.. మా చిన్నప్పుడు కొల్లాపూర్ లో బుట్ట మామిడి పళ్ళు నేను అక్క కలసి రాత్రికి రాత్రి రహస్యంగా తిని ఖాళీ బుట్టను వదిన వాళ్ళమే కాదు.. మరి అది తాండ్ర అంటారో లేక ఇంకోటి అనాలో తెలియటంలేదు. రోలరు అని పేరెట్టారు కానీ, మామిడి రసం లా ఉంది నోట్లో పెట్టుకుంటే… ఈ సమ్మార్ మామిడి తినలేదని ఇంక నేను ఫీల్ అవ్వక్కర్లేదు. నిజంగా నిజం. కొల్లాపూర్ మామిడి పళ్ళ బుట్ట మీద ఒట్టు.
ఊరగాయ అలాఉంచండి, పోడులు ఎన్ని రకాలో… శనగ పొడి, కొబ్బరి పొడి, కూర పొడి, ఇడ్లి పొడి, నల్ల కారం … నాకు ఇన్ని రకాలు తెలియదు కూడానూ.
స్వీట్స్, గవ్వలు, డ్రై ఫ్రూప్ట్స్ తో ఉన్న పూతరేకులు, జీడిపప్పు పాకం, నువ్వుండలు, మిక్సర్, పప్పు చెక్కలు.. ఆహా…. నిజామా…. ఆహా నే.. ఎదో మాయ బజార్ లో వివాహ భోజనం పాట ముందు డైలాగు లా ఉందా? కాదండి అవ్వని వారి ప్రొడక్ట్స్… నేను ఏవో ఒక చింతకాయ, గోంగూర తీసుకున్నా, స్నేహా ఆనంద్ కలసి, రెండు సంచులలో మా వారి కోసం కట్టి ఇచ్చారు. పిచ్చ మొహమాటం వేసింది. ఎదో ఒకటి రెండో ఇవ్వాలి కానీ ఏంటి ఇది పుట్టింటి నుంచి ఆడపిల్ల వెళ్ళుంటే ఇచ్చిన సారేలా ఇంతనా మరీ ను అంటే వినలేదు. చాలా బలవంత పెట్టారు. సిగ్గుగా అనిపించింది.
కొంచం లేట్ గా ఇంటికి చేరుకున్నాను. మా వారు అన్నం , ముద్ద పప్పు వండి రెడీగా ఉన్నారు శాంపిల్ ఇన్స్పెక్టర్ లా.
ఆ ప్యాకెట్ తెరిచాక ఒక్కసారి గుప్పుమంది సువాసన.
ఆ ఘుమ ఘుమలకు తెగ నోరూరింది. నేను రైస్ తింటం మానేశాను…. అదో వేషం సన్నపడాలని… కానీ ఎక్కువ తింటుంటాను అలాంటప్పుడు. అలానే అయింది.
ఆ గోంగూర ఇద్దరం కల్సి రెండు పూటలలో స్వాహా చేశాము. మిగిలినవి కూడా సూపర్ కానీ మరి నాకు గోంగూర వీకెనెస్. గోంగూర మహా రాజులా కళ్ళముందు ఉంటే.. మిగిలినవన్నీ మనకు కనపడవన్నమాట ( సామెత చేపినట్లు… రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చుస్తే మొత్తబుద్ది వేసిందట) ఇద్దరం ఆహా ఓహో అను జుర్రుకున్నాము గోంగూరను…
ఇక హాయిగా ఉంది.. ఇండియా వెళ్ళి వెంటనే రాకపోతే మొగుడు చిక్కి, నేను వెత్తుకోవాలెమో మారిపోతాడనే దిగులు తప్పింది. హాయిగా వాళ్ళ దగ్గర కావలసిన ఊరగాయ తెచ్చుకు తింటారు. శుభ్రంగా, శుచిగా, కమ్మని అధరవులు అందుబాటులో వుంటే ఇంక బెంగేల?
శుభం! మనం త్వరలో ఇండియాకు చెక్కేయోచ్చు…… జై “ఆహా!”
ఓహో!
అది స్వాహా! ఇది స్వాహ!
మనం మాయం:)

