అందమైన సముద్రతీరం
అంతకన్నా అందమైన బీచ్ వెంబడి మార్గం,
ఆ సముద్రపు వడ్డున ఒక ప్రక్కన ‘వారిజ’ ఆశ్రమము
ఎక్కడ్నుంచి చూసినా కొబ్బరి చెట్ల దర్శనం
కన్నులకు పండుగగా ఆకాశము
ఏకమగునట్లు దివ్యదర్శనపు సాగరం
ఆశ్రమంలో అందమైన కుటీరం
పర్ణశాలల సోయగం
వేద పాఠశాల, అంధబాలల విద్యాలయం
దినమంతా భగవంతుడు శ్రుతి చేసిన హోరున సంద్రం
దీటుగా హయగ్రీవాలయన వేద గానం
నిండుగ కాపున పండ్ల చెట్లు ప్రాంగణం
కడుపు నింపు కమ్మని బోజనపు
ఇందు హరితము అంచున సాగరం
మది పులకించు ఇచ్చటి సౌందర్యం
ఇక్కడ జలమే కాదు ఘర్మజలము (చెమట) కూడా అధికం
తుడిచినా, విడిచినా దుర్లభం
జీవితం
ఎదిఏమైన ఈ నగరం
మనకు కలిగించు దగడం(దడ)
ఇదే విశాఖ పట్టణం
