నిన్నటి వరకూ నాకు నేను తెలియదు
నేడు నాకు నేనె కాదు ఎవ్వరూ తెలుయదు
తెలిసినది ఒక్కటీ లేదు
తెలుసుకొవాల్సినదెమిటో కూడా తెలియదు
అనంత అజ్ఞానము
అలమరింది చుట్టూ
వెలుతురు నిలిచేది క్షణమే
చీకటే కదా నిలిచేది సదా
మనకున్న కన్ను మూసినా తెరచినా…
చికటిని తెలుకున్న,
వెలుతురు కనిపించునుట ….
అహమన్నది మానవ దృష్టి
కన్ను మూసి చూచిన తెలియును
అసలు సత్యం
అంతః కరణములు అంతఃమఖమున చూచిన
చీకటిలో వెలుగురేఖలు విచ్చుకొను
వాటికై అన్వేషణ అనంతమైన వేదన
అందుకొన్న మనసు సంసిద్ధం కావలెను
అందులకే ఉండాలి
మనసున సదా గురు దీవెన
అందని ఆ ఫలములు ,అందును ఎవ్వరికైనా
ఆనాటికి సంభవించు జీవితమే దీపావళి .