“మీతో స్నేహం స్వల్పం
మైత్రికి హృదయం ముఖ్యం
అందుకే మిమ్ముల బాగా ఎరుగుదన్నది సత్యం”
అన్న భుజంగరాయ శర్మ గారి మాటలు ఎంత నిజాలో నేడు నాకర్థమైయ్యింది.
నిన్న మా చిన్ని కుటీరము వేదికైయ్యింది ఆ మాటలలోని నిజాలు అక్షర సత్యమని తెలుయటానికి.
నిన్నటి రోజు తార్నాకా పర్ణశాలలో నవ్వుల పువ్వులు పూచాయి. మిత్రుల కబుర్లు, కౌగిలింతలు, అల్లర్లు,పాటలు, నృత్యాలు ఒకటేమిటి అన్నీనూ…సంతోషపు స్నేహ సౌగంధాలలో మా మనసులు తడిసాయి.
అమృతంతో పాటు నవ్వులు పంచే మా అమ్మ , మాకు ప్రియమైన విజయలక్ష్మి గారు,
పెద్దవారు మమ్ముల ఆపేక్షగా ఆదరించు సుశీల సోమరాజు గారు,
స్నేహాని హాయిగా పంచే తెలుగువారి ప్రియ రచయిత్రి బొమ్మదేవర నాగకుమారి గారు,
సౌహిత్య మిత్రులు కల్యాణి గౌరి, వసంతశ్రీ, గిరిజగారు,విజయ అక్క,ఇందిరా ప్రియదర్శిని, నళినీ ఎఱ్రా గారు, సరస్వతి పొన్నాడ గారు, నిర్మల చర్లపల్లి గారు, రూపా కుందూరి గారు, దుర్గా జొన్నలగడ్డ గారు,అంతా కలిసాక గంటలు నిముషాలై దొర్లాయి.
ముఖపరిచయము లేకపోయినాముఖ పుస్తక పరిచయంతో
హృదయానికి దగ్గరైయి మిత్రబృందం స్నేహానికి హద్దులు ఎల్లలు వయస్సు అడ్డురాదని నిరూపించారు.
నేటి మిత్రల సందండి హేళ, హస్య, గాన, ప్రహేళ,విందు, దానితో పాటు టీ, వందేళ నాటి ఫీల్లరు నుంచి దించిన చిక్కటికాఫీ…..సాయంకాలానికి ముగించారు.
అన్ని మంచి పనులకు ఒక ముగింపు పలకక తప్పదు కాబట్టి…..అలా…నేటి మా భావము పలికించే భావుకల చిరు సమేవేశం ముగిసింది. ఈ విధంగా మా హృదయ్యమున్న భావుకల మనసులు పండింది .