మా చిన్నప్పుడు తెలంగాణాలో వున్న మా వూరి నుంచి కేవలం బస్సులు మాత్రమే లభ్యం. అందుకే బస్సులలో ఎక్కువగా ప్రయాణం చెసేవాళ్ళం. అప్పుడు అదొక ప్రహసనంలా సాగేది. దిగేవారిని దిగనీయ్యకపోవటం, ఎక్కేవారిని అడ్డుకొనటం. ఒకళ్ళను ఒకరు తోసెయ్యటం. కిటికీలు పట్టుకు వేలాడటం. దస్తీ వేసో, టవలు పర్చో… సీటు రిజర్వు చెయ్యటం, ఒకటేమిటి….తోసుకు వెళ్ళేవాడు తోపు……
లైను కట్టక కట్ చెయ్యువాడు వీరుడు…ఇలా ….ఒక రేంజు… వుండేవి బల పదర్శనలు.
ఈ తోసుడు వుంది చూడండి బుద్ది బట్టి… బలం బట్టి.
అది రైతుబజారు కావొచ్చు, బిగ్ బజారు కావొచ్చు, ఎయిర్ పోర్టు కావొచ్చు దేవాలయం కావొచ్చు,మరోటి కావొచ్చు…. కాదేది తోయుటకనర్హం యని తోపులాటే తోపులాటే. బుద్ది వంకర వారు ఓక రకం తోపుడు. బుద్ది లేని వారు ఇంకో రకం తోపుడు. వెరసి ముందువా(నా)రిని తోసి ఆనందించటము.
ఎయిర్ పోర్టులో కాఫీ కోసం వరసలో నుంచొని పావుగంటగా ఎదురు చూస్తుంటే, వెనక నుంచి ఒక పెద్ద మనిషి నన్ను ఒక్క తోపుతోసి ముందుకు వెళ్ళి ….ముందు వాళ్ళని హత్తుకొని అర్డర్ ఇవ్వటం. విమానంలో ఎక్కటానికి వరసలో పిలుస్తున్నా తోసుకు ముందుకు పోవటం….ఒకళ్ళను ఒకరు అత్తుకుపోయేలా నిలబడటం, వెనకవారు ముందువారిని తోయటం…. ఆహ ఒకటేమిటి……
శ్రీశ్రీ పాడింది….. “పదండి తోసుకు… పదండి ముందుకు… “ అన్నది ఇలా లైనులో తోసుకు పొమ్మని కాదని ఎవరన్నా చెప్పాలి బాబు వీళ్ళకి.
మొన్నటికి మొన్న ….చీరల షాపుకు వెళ్ళి చీరలు సెలక్టు చేసి పే చెయ్యటానికి వెళ్తే జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకుంటూ చేతులు కౌంటర్లో తోసి పే చెయ్యటానికి తోసుకోవటం. నా వల్ల కాక దూరంగా అలానే ఒక పావుగంట ఎదురుచూశాక కౌంటర్లో వున్న అతనికి జాలేసి నన్ను రమ్మని నా దగ్గర పేమెంటు తీసుకున్నారు.
లైను కనుక మైన్‌టైయిన్ చేస్తే ఎవ్వరికి ఇబ్బంది వుండదు. మీదుమిక్కిలి ప్రతివారు హాయిగా వారి వారి పనులు కానియ్యవచ్చు.
ఎందుకు మనం ఒక వరసలో నిలబడి సాగటం అలవాటు చేసుకోము? ఎంత పురోగమించినా ఇలాంటి చిన్న విషయాల పైన ఎందుకో మనకు నిరాసక్తి.
ఎదో నీతులు చెబుతున్నానని కారాలు మిరియాలు నూరుతూ గుడ్డు ఉరమకండి మరి, ఒక్కసారి ఆలోచించండి.
చదువుకున్న వారు, పామరులు ఈ విషయంలో ఒకేలా ప్రవర్తించటం ఎంత వరకు సమంజసమండీ?
అమెరికాలో అక్కడ పెరిగిన పిల్లలకు రానిది, మనదేశంలో ప్రజలు అలవోకగా చేసె పని ఇదే. ఈ తొయ్యటం (pushing).
ఏది మంచి పద్దతో, ఏ పద్ధతి మూలంగా మన దైనందిత జీవితం సుఖవంతమవుతుందో ఆ కొద్ది చిన్న చిన్న అలవాట్లు చేసికొని, మన తోటి వారిని అలా పాటించమని అడిగి… కొద్ది మార్పుతో అంతా సంతోషంగా జీవించ వచ్చు.
మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలమీద శ్రద్ధ వహిస్తే మన జీవితాలేగా సాఫీగా సాగుతాయి.
మార్ప ఎక్కడ్నుంచో రాదండీ. అది ముందు మన ఇంట్లో, మరీ ముఖ్యంగా మన దగ్గర్నుంచే మొదలవ్వాలి.
ఎంతకాలము మనము ఇలానె డెవలపింగ్ స్థితిలో వుంటాము? ఎప్పుడు కొద్దిగా పద్ధతులలవాటు చేసుకుంటాము???
ఇది సమయము కాదా మార్పుకు..
ఆలోచించండి!!