మనసులోని మురికి

“మనమంతా బానిసలం

గానుగలం పీనుగలం…

ముందు దగా వెనక దగా

కుడి వెడమలు దగాదగా”

అని శ్రీ.శ్రీ మొత్తుకున్నది ఇందుకేనా? అని సందేహం!!

వివరాలకు వెడితే ;

కొన్ని రోజుల క్రితం ఒక మెసేజ్ చూశాను.

కరేబియను లో వున్న ఒక హిందు మాంక్ -దండపాణి చెప్పిన ప్రసంగము.

ఆయన కాలుష్యం- పరిశుభ్రం  గురించి చెబుతూ, ‘మన ఆలోచనలలో పరిశుభ్రత ఎంత అవసరమే, నెగిటివ్ ఆలోచనలు దరి చేరనివ్వకపోవటం అంత ముఖ్యమైన విషయమే’ అని తెలిపారు.

మనం మన చుట్టూ వున్న పర్యావరణం గురించి, సౌండు గురించి, ఇల్లు – వాకిలి శుభ్రం గురించి తెగ బాధపడుతూ, పరిశుభ్రంగా వుంచుకోవటం కోసం ప్రయత్నిస్తూ వుంటాము.

కాని మన మనసులను, ఆలోచనలను మురికిగా చేసే ఆలోచనలి కానీ, సహవాసం కాని చాలా చేట అని అర్థం చేసుకోము.

దానినే మన పెద్దలు ‘యత్భావము, తత్ భవతి’ అని… యదా భావము తత్ దృష్టి, యదా దృష్టి తత్  వచనం’ అని చెప్పారు.

మన ఆలోచనలు ప్రశాంతత మన జీవితాలలో వినిపిస్తుంది కదా!!

మరి మనం మన మనసులను, ఆలోచనలనూ ఎంత వరకూ శుబ్రంగా వుంచుకోగలుగుతున్నాము?

నెగెటివ్ ఎనర్జీ మనలను తోడేసి, పిప్పి చేస్తున్నా మనకు తెలియదు ఒకసారి.

కొంత మంది స్నేహాలు, కొందరి పరిచయాలు ఎంత సంతోష పెడతాయో, కొందరివి అంత కలచివేస్తాయి. మనము మనకు తెలియకనే చాలా సమయం ఇలాంటి వారిపై వృద్ధా చేస్తాము.

మనలను గౌరవించక, ఆదరించక…. మన ప్రతి మాటలను ప్రతి క్షణమూ త్రాసులో తూచి, మన వెనక మాటలు పంచి,గోతులు త్రవ్వి, మన పురోగమానికి ఎడ్చే వారే ఎక్కువగా వుంటే, మంచితనానికో, మరోటందుకో వాళ్ళను మన జీవితాలలో భరించటం మన తలలో కాలుష్యం పెంచుకోవటమే.

అలాంటి వారికి ఉద్వాసన త్వరగా పలకటం మంచిదని చెబుతారు దండపాణి.

అలాంటి వారు మనకు తెలీకుండా మన చుట్టు పరిచే కాలుష్యం మనకు కనిపించని విషం.

అది వలయాలు పరుస్తూ వుంటుంది. దీనికి మంచి మందు అలాంటి వారిని దూరంగా వుంచటమే.

దాని వల్ల పోయేదేమి వుండదు తలలో దుమ్ము తప్ప.

కొన్నిసార్లు మన తప్పు లేకుండా మన మాటకు కోడి గ్రుడ్డుకు ఈకలు పీకే ప్రబుద్దులు వుంటారు.

వారు మన భావమందు తప్ప లేకపోయినా, వారి  భాషా ప్రావిణ్యతతో తోకలతికించి పంచుతారు.

వారలకు ఒక నమస్కారం పెట్టి తప్పుకోవాలి. ఇందు వలన మన ఎనర్జీ, కాలము రక్షింపబడుతాయి.

నా మిత్రులలో ఒకరు రెండు రోజుల క్రితం ఇదే విషయం మాట్లాడారు…ఆలోచనలలో అంతులేని చెత్తను నింపిన అనుభవము నుంచి బయటకు వచ్చి మనసును, నవ్వును జీవితాని స్వచ్ఛంగా మార్చుకోవటానికి తను ‘విపాసన’ లో చేరామని.

అంటే అదో మెడిటేషన్.

ఆలోచనల తోటలో కలుపుమొక్కలు రాకుండా పెంచుకోవాలి.

అమ్మవారు సర్వులలో బుద్ది రూపేనా వున్న (యా దేవి సర్వ భూతేషు బుద్దిరూపేణ సంస్థితా..) కొందరి బుద్దిలో రక్తక్ష, రక్త పింజరులు వుంటారు..

కాబట్టి మన తోటను పరిరక్షించుకున్నట్లుగా… మన ఆలోచనలనూ పరిరక్షించుకోవటానికి మందు… దండపాణి సూచించింది,ఆ ఆలోచనలను పేపరు పై పెట్టి వాటిని కాల్చటము.

అలాంటి వారి నుంచి తప్పుకోవటము ఉత్తమము.

అప్పుడు:

మన దృష్టి ఆలోచనా పనికి వచ్చే పనులకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది.

ఇల్లు శుభ్రం పెట్టుకుంటే ధనం కలిసొస్తుందని ఫెంగ్ సుయ్ చెబుతుంది.

మన ఆలోచనలను శుభ్ర పరిస్తే మనశాంతి ధనం మనను చేరుతుందనటానికి సందేహము లేదు.

ఓం తత్సత్

(దండపాణి కి FB లో పేజీ కూడా ఉన్నది. ఎనర్జీ గురించి ఆయన చెప్పిన విపులమైన జ్ఞానం ఇంటరెస్ట్ ఉంటె చూడవచ్చు. )

One Comment Add yours

  1. kondalnjyahoocom says:

    Very well said …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s