బదిరిలో అద్భుతమైన ఆతిధ్యానికి అష్టాక్షారీ క్షేత్రం:
బదిరిలో వుండాలంటే మనము ముందుగా ఎక్కడ వుండాలో చూసుకోవాలికదా!!
సాధరణంగా టూరు ప్యాకేజీలలో వెళ్ళేవారికి అందులో భాగంగా నిర్వాహకులే యాత్రికుల బసను ఏర్పాటుచేస్తారు.
కానీ విడిగా ఎలాంటి ప్యాకేజీ లేని నా వంటి వారికి, ముందుగా వసతి బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ అక్షక్షాషరీ క్షేతం సౌకర్యవంతమైన, అద్బుతమైన వసతి అందిస్తోంది.
విశాలమైన, శుభ్రమైన ఆవరణ అలకనంద ప్రక్కనే గలగలలతో ఎంతో ప్రశాంత కలిగిస్తుంది.
విడివిడిగా చిన్న పెద్ద గదులు,,గుంపుగా వచ్చే యాత్రికులకు 40 పడకల హాల్స్, వండుకోవాలనుకునేవారికి వంటగదులు, యాగశాల,
అలకనంద లో స్నానమాడాలనుకునే వారికి నదిని
సమీపించటానికి మెట్లదారి…
అన్నింటికి మించి ఉచిత స్వచ్ఛమైన తెలుగు భోజనం అక్కడ లభ్యం.
ఉచిత భోజనమంటే ఎదో ఒకటి అరా కాదు. చక్కటి రుచికరమైన, శుభ్రమైన భోజనము. కూర, పప్పు, రసము, పచ్చడి, మజ్జిగ తో కూడిన అన్నము.
బదరిలో ఇంత చక్కటి (అన్నం)భోజనము దొరికేది ఈ ఆశ్రమములోనే.
ప్రతి ఉదయము ఇక్కడ సాదు సంతులకు ముందుగా 9 గంటలకు భోజనము అందిస్తారు. అది శ్రీ పెద్దజీయ్యరు వారునుంచి మొదలెట్టిన సాంప్రదాయం.
ఉదయము ‘బాలభోగం’ పేరిట ఆశ్రమం లోని పెరుమాళ్ళు కు సమర్పించిన నివేదన యాత్రికులకు బ్రెక్ ఫాస్టుగా వడ్డిస్తారు.
మధ్యహానం పూర్తి స్థాయీ భోజనము, సాయంత్రం ఉప్మా. ఈ విధానములో మార్పు వుండదు.
ఏకాదశి నాడు కూడా ఆశ్రమములో ఈ ఉచిత భోజనము అందించటము మానరు (ఆశ్రమం లో ఉపవాస దీక్ష లో ఉంటారు ఏకాదశికి).
చాలా మంది యాత్రికులు కేవలం చక్కటి రుచికరమైన తెలుగు భోజనము కోసం ఆశ్రమానికి వస్తారు.
వారు వసతి మరెక్కడో వున్నా ఈ కారణాన ఆశ్రమ సందర్శనము చేస్తారు.
ఇక్కడి అన్నదానముకు ఎంత పేరుందంటే… కొంతకాలము క్రింద వచ్చిన వరదలలో కూడా ఈ అన్నదాన యజ్ఞం ఆగలేదు.
ఆనాటి అన్నదానము జరిగిన కొన్ని ఆశ్రమాలలో ఈ అక్షాక్షరీ ఒకటి. ఆనాడు జరిగిన అన్నదాన యజ్ఞం మూలంగా అక్కడ ఈ ఆశ్రమానికి
చాలా మంచిపేరు వచ్చింది.
ఇక్కడ వున్న యాగశాల లో సదా భక్తులు హోమాదులు చేసుకునే వీలుగా వుంటుంది.
తమ భోజనము తమే వండుకునే ఎన్నో సమూహాలకు కూడా ఇక్కడ వెసలుబాటు వుంది
ఈ ఆశ్రమములో వున్న దేవళంలో సదా నిత్య అర్చనలు జరుగుతాయి.
బదిరి నారాయణను ధామానికి కేవలం 5 నిముష దూరంలో వున్న ఈ ఆశ్రమమునకు నాకు శ్రీ చిన్నజీయ్యరు స్వామి వారి ఆశ్శీసులతో రెండు వారాలు వుండే అవకాశం లభించింది.
ఆశ్రమములో మేనెజరు, నిర్వహుకులు, అర్చకులు రాఘవ స్వామి, మిగిలిన వాలెంటీర్లు నాతో ఎంతో ఆదరముతో వున్నారు.
స్వామి వారి అనుజ్ఞ తో అక్కడకు వెళ్ళానని వారి నన్ను శ్రద్ధతో కనిపెట్టుకు చుశారు. వారి అవ్యాజమైన ఆదరణతో నా బదిరి యాత్ర సులభమైంది.
చలి ప్రదేశం లో అన్నం అరగదని నాకు చపాతీ పెట్టేవారు అక్కడి పిన్నిగారు.
ఉదయము సాయంత్రం చక్కటి టీ ఇచ్చేవారు.
గదిలో చలి ఎక్కువగా వుందని నాకో రూము హీటరు ఇచ్చారు. ఒకటేమిటి నా అవసరాలకు వారి వస్తువులిచ్చి ఆదరించారు.
నేను ఎంత వేడుకున్నా నా వద్ద గది అద్దే తీసుకోలేదు. నేను ఇంక చెసేది లేక అన్నదానానికి కట్టి వచ్చేశాను.
వచ్చేముందు కూడా ఇంకోరోజు నే వుండాలి. కానీ, వానలప్పటికే ఒక రోజు నుంచి పడుతున్నాయి. వుంటే రోజు బందు
అవుతుందని శ్రీధరు నాకు బండిని తెప్పించి పంపివేశారు. లేకపోతే రోడు క్లోజు అయి నేను నా హైద్రాబాదు ఫైట్ తప్పిపతుందని. నేన వచ్చిన రెండు గంటలలో అక్కడ రోడు స్లైడు జరగటం రోడు బంద్ అవటము జరిగిపోయాయి.
ఆ ఆశ్రమములో వారికి సదా హరి నామము, ప్రక్కవారికి తమ వద్ద వున్నవి పంచుకోవటం తప్ప మరోటి తెలీదనపిస్తుంది.
అక్కడ ఎటు వైపుగా చూసినా నీలకంఠ పర్వతం కనిపిస్తూ కనువిందు చేస్తుంది.
ప్రశాంతమైన ఆ వాతావరణ మనలను చింతలు బాపి శాంతినిస్తుంది.
నేను ఆ ఆశ్రమం లో గడిపిన కాలము మరచిపోలేను అద్బుతమైన కాలము నాకు. అక్కడ్నుంచి వచ్చినా నేను మళ్ళీ బదిరి దర్శనం కోసం ఉవ్విళ్ళూరుతున్నానుంటే వారి ఆదరణ కూడా అందుకు ఒక కారణం.




