2016లో ఇండియా వచ్చినప్పుడు, హైద్రాబాదు నుంచి ఏమీ తేవాలని అక్కయ్యను అడిగితే’పున్నాగపూలు’ పట్టుకురా! అంది. అలా నేను ఆ పూల పరిమళం అఘ్రాణించాను.
ప్రాణిక్ హీలరైన మా అక్క అప్పటి వరకూ ఎంత చెప్పినా తలకెక్కని హీలింగు పై, విపరీతమైన జిజ్ఞాస కలిగింది ఆ పుస్తకం చదివాక…. ఒక మనిషి అసలు ఏ రకంగా సంబంధం లేకుండా నిస్వార్థంగా మరొకరి బాగోగులు చూడటం, ఎనర్జీ పంపటం(తల్లితండ్రులు కాకుండా)…ప్రపంచములో భాదిత వర్గం కోసం తమ ప్రార్థనలలో కలపటం…అసలు సదా పరుల క్షేమము కోరటం… అవ్వన్నీ సాధ్యమనీ…ఆ పుస్తకం చదవకపోతే నే నంతగా కన్విస్సు అయ్యేదాన్ని కాదేమో.2016
నుంచి నేటి వరకూ బెస్టు సెల్లింగు పుస్తకంగా అమ్మకాలలో నిలచిన ‘పున్నాగపూలు’ నాలో చాలా మార్పు తెచ్చింది. ముందుగా,ముఖ్యం గా నాకు హీలింగు మీద గౌరవం కలగటమే కాదు లోతుగా తెలుసుకోవాలని కోరిక కలిగింది.
చెన్నై లోవుండే జలంధర గారు ‘మైత్రి’ అని ఒక కాలము కూడా నిర్వహిస్తారు. ఆ కాలమ్ ద్వారా వారు చాలా మంది అవసరాలకు తగ్గ ఆఫర్మేషన్స్ ఇస్తూ, హీలింగు చేస్తూ సహాయం చేస్తున్నారు కూడా.
పూన్నగపూలు’ చదివి – హీలింగ్ నేర్చుకోవటం ఆధ్యాత్మకత– వెతుకులాటలో మరో అడుగు వెయ్యటానికి సహయపడిందన్నది నా నమ్మకము.
వాదులాడే సందేహాప్రాణులతో కాలయాపన కన్నా ప్రక్కవారికి నిస్వార్థంగా ఎమి చెయ్యచ్చో చెప్పే ఏ విద్యైనా గొప్పవే కదా!!
హీలింగు పై పెరిగిన గౌరవం నన్ను జలంధర గారితో కలిపింది(Thanks to Suresh). హైద్రాబాదు రావలసివున్నా వారి డేట్స్ లో మార్పుతో కలవ లేకపోయాను. మా అరుణాచల యాత్రకు చెన్నైలోనే క్యాబు తీసుకు వెళ్ళేది.
వారి చూపిన ఆదరణ ఆప్యాయత అపురూపమైనది. వారి చూట్టూ వున్న ‘అరా’ చాలా విశాలమైనది.
“ప్రతి వారు తమతో పాటు ప్రక్కవారి మేలు కోరాలి.
మనము చెసే ఎలాంటి సాదనైనా (జపము, ధ్యానమో మరోటో) క్రియా తో అనుసంధానపరచాలి. క్రియను ప్రతి దినము సాదన చెయ్యాలి. మన వద్ద పని చెసే శక్తి వుంది. విశ్వంలో అనంతమైన శక్తి వుంది. కలపటానికి వైరు పెట్టి స్విచ్చు వెయ్యాలిగా. అదే క్రియా సాదన. (అమ్మవారి నామపారయణములోనైనా,జపం లోనైనా, క్రియా సాదన ఒక క్రమ పద్దతి లో ఫలితాలందిస్తుంది.)
కర్మలు వివిద రకాలంటాయి కదా!! పూర్వ కర్మలు మనతో పాటూ వస్తూ వుండే ప్రారబ్ధకర్మలు. వాటిని మనము అనుభవించవలసినదే. కొత్త కర్మలు చెయ్యక నిష్కామ కర్మల యందు జ్ఞానముతో వున్నా ఈ ప్రారబ్ధ కర్మలు వెనకకు లాగుతాయి. వీటిని తగ్గించుకోవటానికి క్రియా యోగం సహాయకారి.
సదా సత్కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితము పరమాత్మ కృప అని, కాబట్టి వాటి ఫలితం కూడా పరమాత్మకే చెందుతుందన్న ఎరుక కలిగి వుండే స్థితి కలుగుతుంది.
వీటికి వల్ల మన తోటి వారికి చేతనైన సహాయం చెయ్యగలం. అది వస్తు రూపేణ కావచ్చు, మాట రూపేణ, సేవ రూపేణ లేదా హీలింగులో బ్లెస్సింగులు ఇచ్చి కానీ. ఏది ఏమైనా మనం కోరేది సర్వేజనసుఖినో భవంతు’ అయి వుండాలి.
ఇంత సాదన చేస్తున్న కొన్ని సార్లు విసిగించే సందర్భాలు వస్తాయి. మనము సదా మన హృదయం లో పింకు ఎనర్జీ ని ఫీల్/ అనుభవములో తెచ్చుకుంటే మనము సదా ఆ జాగృతిలో వుంటాము. దీనికి మూడు స్థాయీ భేదాలుంటాయి.
అవి :Instinct, Intellect, Intuition
ఇవి సాధకుని వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా పనిచేస్తుంది. “
ఇలా మౌనము బలవంతముగా కాకుండ మనసులో నుంచి సహజం గా మౌనము పుడుతుంది. ఆ మౌనము మనకు – సాధకునికి ముందుకు నడవటానికి మరింత సహాయపడుతుంది”…ఇలా ప్రవాహం లా జ్ఞానము… నాకు లభించింది.
జ్ఞనప్రదాయినిగా జలంధర గారు నాకిచ్చిన సలహ ‘సదా ప్రక్కవారికు మంచిని/Help పంచుకుంటూ సాధనలో ‘ ముందుకుసాగమని.
వారు ఎంత జ్ఞానము పంచుకున్నా, మనము గ్రహించగలిగేది కొంతే వుంటుంది. దానికి తోడు శ్రీవారి తొందర పెట్టడం.
బయలుచేరకతప్పదని మా కిద్దరికి అర్దమైయ్యింది. వారు వాట్స్అప్ లో సలహాలను ఇస్తానని ప్రామిస్ చేశారు.
హనీ ని మనస్పూర్తుగా దీవించారు.
లోపలికి తీసుకుపోయి చంద్రమోహను గార్కి పరిచయం చేశారు.(మా శ్రీవారికి చంద్రమోహను, జలంధర గారు జంట అని అప్పటి వరకూ తెలియదు)
గేటుదాక వచ్చి సాగనంపారు
మహోన్నత్తమైన హీలరు, ప్రేమమూర్తి అయిన జలంధర గారికి వీల్కులు పలికి మేము రమణుని ఆశ్శీసులకై తిరువన్నామలై సాగిపోయాము!!