హఃంస ఎగిరింది గగనానికి
హృదయాంరాళ నుంచి!
పల్లంలో పంట కాలువవెంట
పరుగిడుతూ తిరిగింది।
పంట భూములలో వరిచేలను
మృదువుగా నిమిరింది!
పల్లె ప్రజల లోగిళ్ళ సంక్రాంతి మగ్గులను
గునగునగా చూసింది
గుంభనగ నవ్వింది.।
ఆసాముసలైనా ఏ సాములైనా
హఃంస ముందంతా మొకరిల్లవలసినదే!!
అడవులలో అలరారి అందాలు చూసింది..
గడ్డి పువ్వులకు నీలి రంగులద్దింది।
జడివానలో వంపు వాగులలో హాయిగా తడిసింది..
పట్నల గజిబిజిల హడావిడులకు
కొంత తత్తరపడ్డా …
యోగా సెంటరులలో కొంత నిలచింది
హఃంస ఎగిరింది గగనానికి!!
జ్ఞాన్నాని పంచే గురువులకు మ్రొక్కింది
అజ్ఞనపు తిమిరాన్నీ అదిలించి లేచింది
పర్వతపు ఎత్తలను
పీఠభూముల లోతులను
ప్రేమగా తడిమింది…
హిమవంతునికి కైమోడ్పలందించి
మేరు నగరుపై వాలి కొద్ది క్షణములు నిల్చి…
ఆసాంతముగా హిమవంతుని దర్శించి..
గంగమ్మ కొంగులో కొంత తడవాగి..
సత్యలోకాల వాణి చేతిలోని కచ్చపిలోగమకాలు పలికింది!
శికరాగ్రమున జగజ్జనని పాదాలపై వాలి తనువెల్ల వదిలింది!!
హఃంస చేరింది ఆ మజిలీకి.
మన హఃంస చేరాలా గమ్యానికి!!
హం…సోహం!!!
సంద్యాయల్లాప్రగడ