హృదయ దహరాకాశాన వెలిసిన
అరుణా అతి కరుణామూర్తి…
జగమునందు వెలసిన మాయను బద్దలుకొట్టి
సత్య స్వరూపమును
తెలుసుకొనుటకు ఇచ్ఛను కలిగించిన ఇచ్ఛాశక్తివి నీవు.
నడుస్తున్న దంతా నీ మాయయని, విషయము తేలుసుకొను జిజ్ఞాసతో సద్గురువుల సన్నిద్దినిచ్చిన జ్ఞానశక్తివి నీవుకదటమ్మా!
తపనగా అంతఃకరణములో నిలచి, నా అంతరింద్రియములను నడిపించే క్రియాశక్తివి మాతా….
అతి నిద్ర, అలసత్వం లేని క్రమమైన సాదన కూడా నీవ్యై నిలచి నడుపుమా!!
మూలాధారము స్వప్నావస్థలో నిలచిన కుండలిని … ఈ సాదనతో
క్రమముగా జాగ్రుతమై నన్ను తుర్యము వేవుకు నడిపించు!!
గురువుల రూపాన అరుదెంచిన గురురూపిణీ తల్లీ, సదా నన్ను నీ పాదచరణన సంజాతగా నిలువనీయి గురు మండల రూపిణీ.
బ్రహ్మాండ పిండాడాల కదలికలు, క్రియలూ నీ కన్ను రెప్పల పాటు సమయము..
సృష్టి నీ సంకల్ప వికల్పములుగా జరుగు ఈ క్రీడలో నీ నామము మాత్రమే కదా మాకు చుక్కానీ.
పూర్ణమైన మౌనము నీవు… పరమాత్మ ఆత్మవు నీవు…
జ్ఞన ప్రకాశ రూపమై వెలుగు మండల రూపిణీ
నా సర్వ అణువుల కలయిక నీవేనన్న ఎరుక తీయ్యకు నానుంచి.
పరమాణువులలో పరమాణువును. నీ పాద దూళిగా మారు వరము నివ్వు!