ఈ మధ్యకాలములో ఇండియాలో పండుగలు ఎలా జరుపుకుంటున్నారో నాకు తెలియదు కానీ,
మా చిన్నప్పుడు ఏ పండుగ వచ్చినా సరే అదో పెద్ద హడావిడి గడబిడా.
ఉదయం మామిడి ఆకుల గలగల తో పాటు మా నాన్నగారి అరుపులతో సుప్రభాతాలుగా మొదలయ్యేది. గడపలకు పసుపులు కుంకుమలు రంగులద్దటం, మేము కుయ్యో మొర్రో మని లబలబ లాడుతున్నా వినకుండా కుంకుడు కాయలతో రుసరుసా తలస్నానాలు.. బలే బలే మని మురిపించే కొత్తబట్టలు …అన్నింటి కన్నా మజామజా అయిన మరో విషయం సెలవలు. పండుగంటే సెలవలే కదా. రోజంతా ఎగురుడే ఎగురుడు.. చిన్నప్పుడు పెద్దప్పుడు ఇండియాలో ఇదే సంతోషము.
అదే ఇప్పుడు మాకు మన పండుగలన్నీ ఒకేలా వుంటాయి. దేనికి అంతగా ఉత్సాహంగా వుండదు. కానీ గత నాలుగు సంవత్సరా లుగా మేము ఇక్కడ (అమెరికాలో) వున్న కుటుంబ మంతా క్రిస్మస్ కి కళకళ లాడుతూ కలుస్తున్నాము.
కిస్మస్ కి ఇక్కడి బిరబిరా మంటూ పండుగ వాతావరణం గాలిలో తేలియాడుతూ వచ్చేస్తుంది అందుకే. ఎక్కడ చూసినా అందరూ పాజిటివ్ ఎనర్జీ , హడావిడి చకచకా పంచుతుంటారు.
ప్రతి షాపులోనూ మనకు ఏవో ఒక డీల్స్ కన్నుకొట్టి కేకెస్తూ వుంటాయి. దాంతోపాటు బోలెడు చవుకగా రకరకాల సామాను మనలను రా.. రా….రమ్మని ఆశగా చేతులుసాచి పిలుస్తూ వుంటాయి.
క్రిస్మస్ కి అందరూ తోటి వారికి అందరికీ గిరగిరా గిఫ్ట్ పంచుకుంటారు. ప్రక్కవారికి తోటివారికి, వర్కులో అన్ని చోట్లా ఈ గిఫ్ల్ నడుస్తాయి. చెత్త తీసుకుపోయే వేస్టు మేనేజుమెంటు వారి నుంచి, పోస్టు మ్యాను నుంచి అందరికి ఎదో కొంత పరపరా పంచుకోవటం పండుగ సంతోషంతో వుంటుంది. ఆఫీసులన్నీ ఫీసు(peice) ఫీసు(peace)గా మారి సెలవలో మునిగిపోతారు. ఇంక హాయు హాయిగా, వద్దనా సెలవలే!! కావాలన్నా పనుండదు!!
సరే మా తమ్ముడు, పిల్లలూ, అక్కయ్య పిల్లలూ, హనీ అందరూ బిరబిరా వచ్చి ఆ వారం సందడి చేస్తారు అట్లాంటాలో. అందుకే పండుగ హడావిడి టకటకమంటూ టక్కని వచ్చేస్తుంది.
ఇంక మా ఇంట్లో నా హడావిడి మిథునం లో లక్ష్మి లెవల్లో వుంటుంది. తెగ హైరానా పడతాను. గరాజు(garage)లోనే ఇంక వంట కొట్టం మొదలెట్టే స్తాను. ఇక్కడ ఇళ్ళలో గాలి జోరదుగా అటూ ఇటూ.. వాసనలు వచ్చేశాయంటే ఎలాంటివైనా ఇక పట్టుకు వదలవు ఒక పట్టాన.. వింటరులోజలుబులా బట్టలకంటిన కాఫీ మరకలా…అందుకే నూనె సరుకు అంతా గరేజి లో షిప్టు. నూనె బట్టీ పెట్టేస్తాము అన్నమాట.
మా గరేజులో చల్లగా వుంటుంది. అక్కడ సెంట్రల్ హీటింగు వుండదు . చలికి గజగజా మంటూ నేను పిండి వంటలు చెయ్యటమూ, మా ఇంటిలోని శ్రీవారు గిజగిజ మంటూ గింజుకోవటం , ఇంట్లోకి రమ్మని లబలబ లాడుతూ మొత్తుకోవటం, గిరగిర తిరుగుతూ హడవిడి పడటం కూడా మా ఈ డిసెంబరు పండుగ లలో జరిగే స్పెషలు.
నేను ఒకటీ రెండు గంటలు టకటక లాడించి ఇన్ని జంతికలూ, చెక్కలు, స్వీట్లు చేసుకు ఇంట్లోకి వచ్చానా, వీరు రుచి చూసే నెపంతో నొట్లో వేసుకొని కరకర మంటూ తింటము మాములే.
పిల్లలు రావటం… క్రిస్మస్ చెట్టు కింద మాకు ఒకరకు ఒకరము గిప్టు పెట్టేసుకోవటం…పరపరా గిప్లు తెరచి చూసి పకపకా నవ్వుకొని…. గుటగుటమంటూ కొంత ఎనర్జీని నింపుకొన్న రామరసం కొత్త సంవత్సరానికి సరిపడా ఆనందాలను ఓన్సులతో గటగటా తాగి….క్రొత్త ఆంగ్ల సంవత్సరానికి రారా మని స్వాగతిస్తాము.
ఇక్కడి మా డిసెంబరు పండుగ ఇలా వుంటుంది.
ఈసారి వారములో అక్కయ్య వాళ్ళ అబ్బాయి వక్కడే రాగలిగాడు. నాలుగు రోజులు అలాఅలా గడిపి మోము బిరుబిర్రుమని మా కారులో పోలో మంటూ పోయాము తమ్ముడి ఇంటికి. మరో నాలుుగు రోజులు గిరుగిర్రు మని గడిపి తుర్రని వెనకు వస్తాము. అమ్మాయిలో ఒకరు ఇండీయాలో ఒకరు లంకలో చిక్కుకుపోయారు. మేము ఇక్కడ ఇరుక్కుపోయామన్నమాట!! వాళ్ళని తెగ గుర్తుచేసుకుంటూ.!!Happy New Year…….
Missing u Hani & Amulu. With love fromAtl …. Amma and rest😍😍