పోపులడబ్బా
అమ్మ పోపులడబ్బా
పురాతనమైనది…
ఇత్తడి ఆ పోపులడబ్బా
సర్వరంగులను నింపుకొని
కుటుంబానికి ఆరోగ్యాన్ని ఆనందాన్నీ అందించేది.
అమృతమయమైన అమ్మ వంటకు ఆ పోపులడబ్బా ముక్తాయింపు ఇవ్వవలసినదే.
ధనియాల సుగంధముతో
ఇంగువ గుభాళింపుతో వంటగది తోపాటు ఇల్లంతా ఒక రకమైన దేశీయ జ్ఞాపకాలతో నిండి వుండటానికి పోపులడబ్బా యే కారణం. ,
ఎరుపు, ముదురు , నలుపు, తెలుపుల రంగులతో కలసిన మిశ్రమం జీవితంలోని సర్వ సమస్యలకు సమాధానము ఆ పోపులడబ్బా.
అక్కయ్య బుగ్గమీద మొటిమకు,
సుమంగళిల గుర్తుకు పసుపు ఆ పోపులడబ్బానుంచే అందుకోవటం.
ఇంట్లో ఎవరకు అజీర్తి అన్నా
కడుపునొప్పి వచ్చినా,
ఆ పోపులడబ్బాలోంచి వాము తీసుకోవాల్సిందే.
తమ్మడి కి జలుబు చేసినా ఆ పోపులడబ్బానే ఆశ్రయిస్తారు.
తాతయ్య దగ్గుకు ఆ పోపుల డబ్బా మిరియాలే సమాధానము
అమ్మ ఆ డబ్బాలో ఎంత దాచేదో కానీ,
ఉదయము కూరల నుంచి, బయట అమ్మొచ్చిక ఐసుపూటుకీ వరకూ అదో అక్షయపాత్రలా అందరికీ అందిచ్చేది చిల్లర.
చివరాకరన చిల్లర కావాలంటే మా నాన్నకు సైతం అమ్మ పోపులడబ్బానే గతి.
సప్త రంగుల మిశ్రమం ఆ పోపులడబ్బా.
భారతీయ జీవితానికి దర్పణం ఆ పోపులడబ్బా
ఆరోగ్యభీమా లాంటి పోపులడబ్బా మా దాకా వచ్చాక రూపు మార్చుకుంది……
మాదాక వచ్చేలోకా రూపు మారింది….
మేమంతా మరిగాము పాస్టాలు, పిజ్జాలు..
అందుకే నేటి మాతిండికి అక్కరలేదు ఎలాంటి పోపులు…
పశ్చిమాని హత్తుకొని వదిలేశాము,
కావాలని కౌగలించుకున్నారు వీరంతా వాటిని… అంది తెచ్చుకున్నారు అమ్మ పోపులడబ్బాను..
ఆరోగ్యసూత్రానికి అసలు రహస్యానీ…
అందుకే అమ్ముకుంటున్నారు
పసుపారోగ్యన్నీ…