పార్టిలు చేసుకోవటానికి కిటుకులు

చిన్న పార్టీ లకు కావలసిన ఏర్పాట్లు 

మనం మన ఇంట్లో పార్టీ అంటే హడావిడి పడటం సాధారణం. మన అతిధులు గుర్తుంచు కునేలా పార్టీని నిర్వహించాలని కోరుకోవటంలో తప్పులేదు. పైపెచ్చు అది మన కనీస బాధ్యత. దానికి ఏర్పాట్లు చేసుకోవటం, మనం కూడా ఆ పార్టీలో మిత్రుల సమక్షంలో సంతోషం పొందటం మన హక్కు కూడా. కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు ముందుగా చేసుకుంటే ఎలాంటి పార్టీ అయినా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. 

ముందుగా పార్టీ అంటే మనం చేసే పార్టీ “టైపు” ఏంటి అన్నది చూసుకోవాలిగా. అంటే పుట్టిన రోజు పార్టీ నా, పూజ చేసుకుంటున్న పార్టీనా, వీకెండ్ పార్టీనా ఇత్యాదివి. 
మన పార్టీ టైపు ఏంటో నిర్ణయించుకుంటే మన ఏర్పాట్లు ఆ విధంగా ఉంటాయి. మనకు ఈజీగా ఆ దిశలో ఏర్పాటు చేసుకునే  అవకాశమూ ఉంటుంది. 
చిన్నపిల్లల పుట్టినరోజు పార్టీ అయితే ఆ అవసరాలు, తినే పదార్థాలు, ఎంటర్టైన్మెంట్ వేరుగా ఉంటుంది. పెద్దలదైతే మరో విధంగా ఉంటుంది. 
మన వీకెండ్ పార్టీలు ఇంకో విధంగా ఉంటాయి. ఏదిఏమైనా ముందు మన పార్టీ ఇస్తున్న సందర్భాన్ని బట్టి మన ఏర్పాట్లు చూసుకోవాలి. 

మొట్టమొదట మనం పిలిచే అతిథుల జాబితా చూసుకోవాలి.  ‘మన మిత్రులనుఎవరిని పిలవాలి’? అన్నది నిర్ణయించుకోవాలి. 

అంటే చిన్న పిల్లల పుట్టినరోజు పార్టీకి పెద్దలను కాకుండా పిల్లలతో, అది పుట్టినరోజు జరుపు కుంటున్న పాపా, బాబులకు  మిత్రులు వుంటే వారితో చేసుకుంటే వారికీ మనకు కూడా హాయి. 
ఒక్కో సారి అది పైజామా పార్టీగా, అంటే స్లీపోవరు పార్టీగా వుంటుంది. ఆ అవసరాలు వేరుగా వుంటాయి కదా. పిల్లలకు పిజ్జా, కామెడి సినిమాతో కానివ్వవచ్చు. 

చిన్న చిన్న వీకెండ్ పార్టీలయితే పిలుస్తున్న అతిధుల జాబితా క్షుణంగా తయారు చేసుకోవాలి. అంటే పిలిచిన వారు ఒకరికి ఒకరు తెలిసినా, తెలియక పోయినా పర్వాలేదు కానీ, శత్రుత్వం ఉండకుండా ఉండే మిత్రుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే వచ్చిన వారు కలివిడిగా కలిసి ఆనందిస్తారు. మనకు హాయిగా ఉంటుంది. పార్టీ కూడా జయప్రదం అవుతుంది. 

మనం పార్టీ ఇస్తున్నది మన సంతోషం తెలుపుకునేది కాబట్టి అలాంటి వాతావరణము ప్రతిఫలించాలి అన్నది మరువకూడదు. ముందుగా ఆ పార్టీ లో మీరు ఆల్కాహాలు ఉంచుతారో లేదు కూడా నిర్ణయించుకోవాలి. ఒక వేళ మీరు వైన్ లాంటి తేలికపాటి డ్రింక్ కనుక ఉంచుతున్నట్లు అయితే, దానికి తగ్గ ఏర్పాటు, ఆ పద్దతి లో కలిసిపోయే వారిని మీ అతిథుల జాబితాలో ఉంచుకోవాలి. 
ఎందుకంటే ఇలాంటివి భారతీయ సమాజంలో ‘టాబూ’ ఉన్న విషయాలు. పార్టీ కోసం, సోషల్ డ్రింకింగ్ మీ అతిథులలో ఎంతమంది సమర్ధిస్తారో ముందే చూసుకోవాలి. 

ఒకసారి ఒక మిత్రుల ఇంట్లో ఒక పార్టీ లో  వారి వదినమ్మ వచ్చారు. డ్రింక్ చేస్తున్నందుకు మరిది మీద కోపం చూపించి,గొడవ చేసి వెళ్ళారు ఆవిడ. 

కాబట్టి ఇలాంటివి ముందు గానే ఆలోచించుకోవాలి పార్టీని ఏర్పాటు చేసుకున్న సమయాన. 
తరువాత చూడవలసినది ఆహారం. ఏ పార్టీకైనా మంచి ఆహరము ముఖ్యం. మన సంతోషం ప్రకటించటానికి చేస్తున్న పార్టీలలో ఆహారం ముఖ్యమైనది కదా ! ఆ ఆహారము కూడా వచ్చే అతిథులు కడుపు నిండా తినేలా వుండాలి. ఒకసారి మమ్మల్ని ఒకరు భోజనానికి పిలిచారు. అక్కడ ఆమె పావుబాజ్జి పెట్టారు. మేము తిని, కొంత సేపు తరువాత ఇంకేమైనా పెడతారా అని చూశాము. తరువాత వడ్డన ఏమీ లేదని తెలసి ఇంటికి వచ్చి పెరుగన్నము తిన్నాము. కాబట్టి, అతిథులకు కడుపు నిండా పెట్టడము పిలచిన వారి కనీస బాధ్యత. మీరు వంట చేసుకుంటున్నారా, లేదా తెప్పించుకోవాలో కూడా ముందుగా నిర్ణయించుకోవాలి. 

పార్టీ చిన్నది అయి, మీరు వండుకోగలిగితే ముందుగా చెడిపోని నిల్వ ఉండే స్వీట్లు ముందు రోజు కూడా చేసుకోవచ్చును. పార్టీ రోజు మీకు శ్రమ తక్కువగా ఉంటుంది. 
చపాతీలు లాంటివి కూడా మీరు లెక్క చూసుకొని తెప్పించు కోవటం, ముందుగా కూరలు తరుక్కొని,కొంత ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవటం వంటివి చెయ్యవచ్చు. 

అతిధులు వచ్చేలోగా వంట పూర్తి చేసుకుంటే, మీరు కూడా వాళ్లతో కలసి ముచ్చటించుకోవచ్చు. మీకు సరదాగా కూడా ఉంటుంది. లేక పోతే, మీరు వంటగదికి పరిమితం, వచ్చినవారు వచ్చినట్లుగా వెళ్ళిపోవటం అవుతుంది. కాబట్టి, మీరు వడ్డించే మెనూ,పదార్థములు ముందుగా సిద్ధం చేసుకోవటం అన్నింటా ఉత్తమం. 
మేము ఒక పార్టీకి వెళ్ళాము, చాల కాలం క్రిందట అనుకోండి. 
ఆవిడ మాతో కూర్చొని ముచ్చట్లు చెబుతూ ఎంతకీ భోజనానికి లేవదు. 

ఒక గంట చూసి మేము తిందామా అంటే అప్పుడు వంటగదిలోకి వెళ్ళి పూరీ చెయ్యాలి అని వత్తటానికి రమ్మంది. 
నేను నా మిత్రులు వంట చేసి, తిని, ఆ గిన్నెలు  కడిగి కూడా వచ్చాము. అలా చేసుకుంటే మళ్ళీ మన గడప ఎవరన్నా తొక్కుతారా?
కాబట్టి ఏమి వడ్డించుకోవాలి, నిర్ణయించుకుంటే వచ్చిన వారికి మనకు కూడా బాగుంటుంది. 
రాగానే అథితులకు ఇవ్వటానికి కొంత జ్యూస్ ,కొన్ని స్టార్టర్స్ లాంటి ఉపాహారమో, చాట్ లాంటి తేలిక పాటివి వడ్డించటం ఇప్పటి పద్ధతి. 
మీరు ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటె ఆ సమయంలో చూపండి. లేదంటే ఒకరితో ఒకరు సంబాషించు కోవటం లాంటివి జరుగుతాయి. 
మీకు ఇంటరెస్ట్ ఉంటే కొన్ని బోర్డు గేమ్స్ కాని  మరోటి కానీ ఆడుకోవచ్చును. 
తరువాత సిద్ధంగా పెట్టుకున్న ఆహారంను బల్ల మీద సర్ది ఎవరికి కావలసినవి వారిని వడ్డించుకోమనటం మంచిది. అలాగైతే అంతా తమకు కావలసినంత వడ్డించుకుంటారు. దానితో వేస్ట్ అన్నది ఉండదు. 
పార్టీ అయ్యాక, మిగిలిన పదార్థాలు మిత్రులు వారికి నచ్చినవి వారు పట్టుకు పోతారు. ఆలా మేము ఇక్కడ వేస్ట్ తగ్గిస్తాము. 
ఇండియా లో అయితే కొందరు ఆశ్రమాల వారు వచ్చి తీసుకు పోతారుట.  
 
ఇంక డెకరేషను. మాములు వీకెండు పార్టీలకు మీ ఇల్లు శుభ్రంగా, వీలు గా వుంచుకోవటము మీ కనీస బాధ్యత. అలా వుంచలేకపోతే అసలు పార్టీలు చెయ్యకపోవటం ఉత్తమము. 
బేసుమెంటు వుంటే అక్కడ ఎంటర్టైనుమెంటు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో విశాలమైన హాలులో అందురూ ఒక దగ్గర కూర్చినే వీలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. 
అదే వేసవిలోనో అయితే మీరు ఆరుబయట మీ ఇంటి గార్డెనులోనో, మేడ మీదనో చేసుకోవచ్చు
ఇవ్వన్నీ చిన్న చిన్న వీకెండ్ పార్టీల గురించి. పెద్ద పార్టీల గురించి మరో సారి మాట్లాడుకో వచ్చును

కొద్దిగా ప్లానింగ్ చేసి, మనం ఆరోగ్యవంతమైన ఆనందకరమైన చిన్న చిన్న వీకెండ్ పార్టీల ద్వారా మిత్రులతో గడపం మనకు ఆరోగ్యానికి మంచిది
దీని మూలంగా మనకు రోజు వారి కార్యక్రమాల నుంచి ఊరట కూడానూ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s