ప్రపంచమంతా ఈ రోజు ప్రక్కవారితో తమ ప్రేమను చెబుతోంది.
ఇంత తియ్యని రోజున ఒక తీపి పదార్థపు రెసిపి మీకు చెప్పి మీ మీద నా ప్రేమ వలక పోయ్యటానికి నేను డిసైడు అయ్యాను.
మీ మీదేమిటి? అని ఆశ్చర్యమా?
అయితే మరి ఈ విశేషం చూడండి:
ఈ తీపి పదార్థం మన ఆధరువులను ఆనందముతో ముంచటమే కాదు చాలా ఆరోగ్యమైన స్వీటు కూడానూ.
మరి సంతోషము దానితో బోనస్ గా ఆరోగ్యము అంటే అంతకు మించి మరోక ప్రేమ వుంటుందా?
అందుకే మీ మీద ప్రేమను ఇలా ప్రకటిస్తున్నానన్నమాట!
ఇంతకీ స్వీటు ఏంటా అనే కదా మీ ఆ చూపుకు అర్థం.
దీని పేరు :
డ్రై ప్రూటు హల్వా
కావలసిన సరంజామా:
2 కప్పుల కర్జూరములు (మనకు లోపలి విత్తనము తీసినది దొరుకుతుంది. లేకపోయినా పరవాలేదు)
1/2 కప్పు బాదముపప్పు
1/2 జీడిపప్పు
1/2 కప్పు పిస్తా, వాల్‌నట్
2 చెంచాలు కిస్మిస్
2 చెంచాలు ఎండు పుచ్చ గింజలు కానీ దోస గింజలు కానీ
1/2 కప్పు నెయ్యి
చిటికెడు కుంకుమపువ్వు.
తీపిని చేసే విధానము:-
1.ముందుగా కర్జూరాలను వేడి నీటిలో మునిగే వరకూ గంట నాన పెట్టాలి.
2.నానిక కర్జూరాలు మట్టుకుంటేనే మెత్తగా చితికిపోతాయి.
3.నానిన కర్జూరాలను మెత్తని గుజ్జుగా చేసుకోవాలి మిక్సీ లో.
4. అడుగు మందముగా వున్న గిన్నె లో 1/2 పందచదార మునిగెలా నీరు పోసి తీగ పాకము పట్టాలి.
5. మరో మందపు అడుగు గిన్నెలో 1 చెంచా నెయ్యి వేసి ఆ కర్జూరాల పేస్టు వేసి కలుపుతూ వుండాలి.
6. మిగిలిన ఈ జీడిపప్పు, బాదాము, పిస్తా, వాల్‌నట్ వీటిని గూడా పొడి చేసుకోవాలి.
7. నెయ్యిలో వేగుతున్న కర్జూర ముద్దకు మిగిలిన డ్రై ప్రూటు పొడి ని కూడా కలిపి కలియబెట్టాలి.
8. ఈ వేగుతున్న ముద్ద కొంత దగ్గరకు వచ్చాక తీగ పాకము కలపాలి.
9. మధ్యలో మిగిలిన నెయ్యి కూడా వేసి ఇలా ఇది మరింత దగ్గర పడేలా అయ్యేంత వరకూ కలియబెడుతూ వుండాలి సన్నని సెగ మీద.
మధ్యలో కలపటం ఆపకూడదు. ఆపితే అడుగంటుతుంది.
బాగా దగ్గరగా వచ్చిందనుకున్న తరువాత ముందుగా నెయ్యి రాసుకున్న ఒక చదరపు గిన్నె లోకి మార్చుకొవాలి.
ఆ ప్లేట్ లో పోసిన హల్వ పై నెయ్యిలో వేయ్యించిన కిస్మిస్, దోసగింజలు, కుంకుమ పువ్వు చల్లుకోవాలి.
ఈ హల్వా చల్లారాక ముక్కలు చేసుకొని గాని, లేదా లడ్డులా చేసుకొని గాని వడ్డించవచ్చు.
కాస్త పంచదార పాకము హల్వా పట్టుకోవటానికి మాత్రమే. తీపి కోసం కాదు. డ్రైప్రూట్ల తో తీపి కాబట్టి పిచ్చి తీపిగా వుండదు.
పూర్తిగా డ్రై ప్రూటులతో చేసినది కాబట్టి ఆరోగ్యము, పంచదార శాతం మొత్తంలో 2% కాబట్టి ఈ స్వీటు చాలా నచ్చుతుంది అందరికి.
పైపెచ్చు ఈ డ్రై ప్రూట్ల ది కాబట్టి ప్రోటినూ కూడా వుండి ఆరోగ్యము గా వుంటుంది.
ఈ స్వీటు మీకు డ్రై ప్రూటు లడ్డూ గా స్వీటు షాపులలో చాలా ఖరీదుకు కూడా లభ్యం. మీరు చాలా సులువుగా చేసుకునేందుకు వీలుగా వుండేది. అందరికి నచ్చుతుంది. కుంకుమ పువ్వు వేసినందుకు చక్కటి సువాసనతో ఆధరువులను ఆనందింప చేస్తూంది.
మరి ట్రై చేసి చూడండి.
పిల్లలకు ఇలా ఆరోగ్యవంతమైన డ్రై ప్రూట్సు పెట్టవచ్చు.
ఇట్లు
ప్రేమతో
సంధ్యా యల్లాప్రగడ
