పంచభూతాత్మకం

అమ్మకు పిల్లలము మనము

తప్పులు కాచి దారి చూపే దిక్ఛూసి మనకు ఆమె

నడక నేర్చు బాలలము మనము,

పడుతూనే వుంటామది మన నైజము..

లేవదీసి, చేరదీసి ఊరడించి,ఓషదమిచ్చు వైద్యరాలామె.

అజ్ఞానులము మనము

తల్లిని తలచిన తడవనే

జ్ఞాన దీపమెలిగించు దక్షిణామూర్తియే ఆమె

భవసాగరమనంతము…

కడు భయానకము..

భవము కౄర అరణ్యము, భయమేల మాకు

ఈ సంసారమన్న అరణ్యమునకు అమ్మ అమృత వర్షమై కురియచుండగా-

పాపమన్నది కడు దుర్భలమైన కాననము.

అమ్మ భక్తి కార్చిచ్చులా కాల్చునా పాపమును.

మరి అమ్మ భక్తులకు పాపమంటునే?

ఈ ప్రపంచమున దార్రద్యము అతి భయంకరము.

అమ్మను నమ్మి కొలచు వారికి ఎట్టి దారిద్యములంటవు.

గాలి దూమారముకు ఎగిరిపోవు దూది ప్రోగు వలె సర్వ దార్రిద్య దౌర్భాగ్యములను తొలగించు అమృతవర్షిణామే.

సర్వ జీవులకు వృద్ధాప్య తిమిరములు భయపెట్టు.

అమ్మ వెలుతురు అన్న భాను రేఖలతో సర్య సంశయమును పగలకొట్టు శక్తిపాతములు.

సముద్రమునకు వెన్నెలల వంటి హాయి, అమ్మ భక్తులకు అనుగ్రహించు అనిశము.

భక్తుల చిత్తాలనే నెమళ్ళకు నల్లని మబ్బువంటిది అమ్మ ప్రేమ!

ముక్తికి రూపమిచ్చిన అది జగదంబే కదా!!

మృత్యు భయం మానవ సహజము.

ఆ మృత్యు భ్రీతి ని గండ్రగొడ్డలితో పెగళించి మోక్షమిచ్చు ను కదా ఆ తల్లి!

అమ్మ భక్తియే మనకి గతి

కలియుగమున మరిలేదు ఇక వెతికిన!!

అందుకే మనమున కల సర్వ కోరికలు అమ్మ పాదాల వద్ద సమర్పయామి!!

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment