రంగుల ప్రపంచము

రంగుల ప్రపంచం 

మాల్లో షాపింగ్లో  మళ్ళీ బ్లూ షర్టు తీసుకున్న మా శ్రీవారిని చూసిఅబ్బా మళ్ళీ బ్లూనేనా? అన్నాను….
బ్లూ ఉంటే ఇంకా మరో రంగు కనపడదు కదా ఆయనకి. 
మధ్యాహ్నం హాని ఫోన్, “అమ్మా! నా వైటు చుడిదారు పంపు, నా ఫ్రెండు పెళ్ళికి అది వేసుకుంటా!” వైటు బాగుంటుంది, సరేలే అనుకున్నా!
అక్కయ్య వాళ్ల పాప కి కొన్న కొత్త చీర ఎరుపు కంచి పట్టు. బాగుంది అని చెప్పాను. 
పెళ్ళికి నీకే రంగు చీర కావాలి?’ అక్క వాకబునాకు పసుపు రంగు నచ్చుతుంది మరి 
ఏంటి?? ఇంట్లో విషయాలు మీకు లిస్టు చెబుతున్నానని గాబరా పడుతున్నారా??వద్దండి.! 
సంభాషణలలో కామన్గా వున్న విషయం అయిన రంగుల గురించి నేటి ముచ్చట. అందుకే ఇన్ని మాటలు చెప్పాను.  

మానవ జీవితం రంగులమయం. 
మనం ఉదయం లేచి చూసేది మొదట, తూర్పున ఉదయించే సూర్యుని నారింజ రంగు, పసుపు ఎరుపులను వెదజల్లుతూకాంతులతో మెరుస్తూ కనపడుతాడు. ఆకుపచ్చని చెట్ల నుంచి వచ్చే చల్లని గాలిని పిలుస్తూ మొదలెట్టే రోజు, రాత్రి మన పడకగదిలో ఉదా రంగు పలచటి కాంతిలో నిద్రించేవరకు రంగులు మన కళ్ళ ముందు మన జీవిత చిత్రం గీస్తూ ఉంటాయి మనము గమనించకుండానే. 
పుట్టిన తరువాత 3 నెలలో రంగును గుర్తిస్తాడు శిశవు. అప్పటి నుంచి మనకి సర్వం రంగులే రంగులు. 

రోజూ చూస్తున్న రంగులైనా, ప్రతి రంగుకు ఒకో అర్థంపరమార్థం నిండి ఉంటుంది. 
రంగులకు ఉన్న శక్తి అనంతం. 
రంగులు వివరించే వివరాలు కూడా చాలా వున్నాయి. వాటి గురించే చెప్పే శాస్త్రాలు ఉన్నాయి. రంగులు మానవ స్వభావాలను విశ్లేషిస్తాయి. వివరిస్తాయి. అది ఎలాగంటే మనిషి ఇష్టపడే రంగు బట్టి వారి మనసత్వం తెలుసుకోవటం. 
శాంతి కోసం తెలుపు, విచారానికి నలుపు,
ఉద్రేకానికి ఎరుపు, ప్రేమకు లేత గులాబి 
సప్తరంగులు ప్రసరితమవుతే తెలుపు, అన్నిటిని దాస్తే నలుపు…. ఇలా రంగుల ద్వారా భావాల వ్యక్తీకరణం చాలా పూర్వం నుంచి వున్నదే. 
మనము ఉన్న మానసిక స్థితిని వివరిస్తాయి రంగులు . మనకు తెలియకుండా మనము మన వస్త్రధారణలో వేసుకున్ రంగుల బట్టి ఆనాటి మన మనః పరిస్థితిని అంచనా వెయ్యవచ్చు. 
ప్రశాంతంగా వుంటే తెలుపు లేదా ఆకాశపు నీలము, దిగులుగా వుంటే నలుపు. ఇత్యాదివి. 
కొన్ని రంగులు మనసును ఊరడిస్తాయి,
కొన్ని రంగులు  ఉద్రేకపరుస్తాయి. కొన్ని రంగులు శాంతపరిస్తే, కొన్ని ప్రేమను పంచుతాయి. 

రంగులు వివిధ దిశలకు వాడి, వారి ఇంటికి, జీవితానికి ప్రశాంతత తెచ్చుకునే శాస్త్రం ఫెంగ్ సూయి. మీరు వినే వుంటారు. 
ఫెంగ్సుయిని వాడి జీవితాలు సుఖమయం చేసుకున్న వారు ఉన్నారు. అందులో కొన్ని రంగు కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో వాడుతారు. దాని మూలంగా కలిసి వస్తుందని నమ్మకం. రంగులు ప్రజల అలవాట్లను, సాంస్కృతిని ప్రతిభింబిస్తాయి. 
భారతీయులు కొంత ముదురు రంగులు వాడుతారు. ఆంగ్లేయులు కొంత లేత పలచని రంగులు వాడుతారు. 
రాజస్థాను లో ముదురు ఎరుపు, పసుపు ఆకుపచ్చ వాడుక చాలా. తమిళనాడు దేవాలయాలలో కూడా ముదురు రంగుల వాడకము చూడవచ్చు. కానీ ఇళ్ళలో తెల్లటి రంగే సామాన్యం. 
కానీ, అమెరికాలో ఇంట్లో గోడలకు ముదురు రంగులు వాడకం చాలా ప్రఖ్యాతి.

బుద్ధి , మనస్సు, ఆత్మల సమన్వయము రంగులు అని అంటారు. 
అంటే, మీకు ఇష్టమైన రంగును బట్టి మీరు ఎలాంటి వారు అన్నది తెలుస్తుంది. పరిశోధనల ఫలితాలవి. అంటే మీరు ఇష్టపడే రంగుల బట్టి మీ వ్యక్తిత్వం చెప్పవచ్చని సైకియాట్రిస్టులు చెబుతారు. 
విధమైన విషయానికి పూర్తి స్థాయి శాస్త్ర సమ్మతం కాకపోయినా, ఇది నమ్మి వైద్యం చేసే వారు కూడా ఉన్నారు. 

ఎరుపు :
రంగుని ఇష్టపడే వారైతే జీవితాన్ని పూర్తిగా జీవించాలన్న సూత్రం మీది. మీరు చాలా ఉత్సహాహంగా ఉంటారు. చాలా ఎనర్జీ ని నింపుకొని, మీ పరిసరాలలో ఎనర్జీ ని వంపుతూ తిరుగుతారు. మీకు నలుగురిలో గుర్తింపు అంటే చాల ప్రియంగా ఉంటుంది. అలాంటి గుర్తింపు కోసం మీరు ఏమైనా చేస్తారుట. అంతే కాదు మీరు మీ వంతు ప్రపంచానికి ఎదో ఒక కొత్త సంగతో, విషయం ఇచ్చేనందుకు ఇష్టపడుతారు. 
పవర్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఎరుపు అంటే ఇష్టపడే వారు. మంచి మేనేజర్ గా రాణిస్తారు. 
రక్తం రంగు ఎరుపు. ఎరుపు రంగు రక్తకణాలు వల్ల మానవులకు శక్తి. శక్తి కి గుర్తు కూడా అందుకే ఎరుపు. 

ఆరంజ్ :
రంగు అంటే మీకు ఇష్టమైతే, మీరు ఒక సీతాకోక చిలుక వంటి వారు. మీకు నలుగురిలో నవ్వుతు, తుళ్ళుతూ తిరగం ఇష్టం. మీరు సదా మిమ్ముల్ని ఛాలెంజ్ చేసుకునేందుకు ఇష్టపడుతారు. మీలాంటి వారు ఎక్కువుగా ప్రమాదకరమైన స్పోర్ట్స్ లో, పర్వతారోహణలో కనపడతారు. 

పసుపు పచ్చ : 
మీకు పసుపు రంగు ఇష్టమైతే, సంతోషం మీ మంత్రం. చాలా పాజిటివ్ గా ఆలోచించే తరహాలో ఉంటారు పసుపు రంగు ఇష్టపడే వారు. ఫరెఫెక్టనిస్ట్ కూడా వీరు. వీరికి చాలా పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి. జీవితం మీద ఆశ, అవగహన ఉంటాయి. నవ్వుతు, నవ్విస్తూ ఉంటారు. 

నీలం : 
ఆకాశం నీలము. కృష్ణుడు నీలము. 
నీలి రంగు ఇష్టపడే వారికీ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే వనరులు కోసం చూసుకుంటారు. నమ్మకమైన మిత్రులు వీరు. వీరికి వీరి బంధాలంటే గొప్ప గౌరవం. వీరితో ఎలాంటి బంధమైనా చాలా సేఫ్. సహేతుకంగా ఆలోచిస్తారు. ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పక్క నున్న వారిని కంఫర్ట్ గా ఉంచే ప్రయత్నం చేస్తారు. పరిసరాల పరిశుభ్రం చాల ముఖ్యం వీరికి.
పశ్రాంతముగా కుటుంబముతో గడపటానికి ప్రాముక్యతనిస్తారు.  

ఆకుపచ్చ : 
హరితం అంటే మీకు ఇష్టమైతే, మీరు చాలా నమ్మకమైన వారు. మిత్రులతో కానీ కుటుంబంలో కానీ నమ్మకం మీకు చాల ముఖ్యమైన విషయం. మీరు మీ అభిప్రాయాలను దాచుకోరు. చాల ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. చాల ప్రాక్టీకల్ గా కూడా ఉంటారు. మీరు మిత్రులకు మంచి బరోసా. ఒక నమ్మకం ఉంటుంది మీరంటే. అలాంటి భావన నమ్మకం మీ సేహ్నంతో  అందచేస్తారు. 

ఉదా రంగు:
ఉదా రంగు అంటే మీకు ఇష్టమైతే, మీరు గొప్ప ఊహాశక్తి ఉన్నవారు.. ఆధ్యాత్మికతకు కూడా రంగు సంకేతం. ప్రఖ్యాతమైన కళాకారులుగా పేరుతెచ్చుకుంటారు. 

తెలుపు అంటే ఇష్టపడే వారికీ చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉండాలి. వస్తువైనా అటు ఇటు గా మారితే వీళ్లకు నిద్రపట్టదు. వెంటనే సర్దేయ్యాలి. పరిసరాల పరిశుభ్రతకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. 

నలుపు అంటే ఇష్టపడేవారు చాల సున్నితమైనవారుగా, ఇంట్రావర్ట్స్ గా పేరు. 

రంగులతో వైద్యం అన్నది కూడా చేస్తారు. దానికి క్రోమోగ్రఫీ అని పేరు.
రంగులకు మనసును సమన్వయ పరిచే శక్తి, ఉద్రేకతను, వత్తిడిని తగ్గించే శక్తి ఉన్నది అని 1850లో  కనిబెట్టబడింది. 
రంగులు ద్వారా జబ్బులు తగ్గించవచ్చన్న విషయము అప్పుడే కనిపెట్టారు.   పరిశోధన వివరాలు ముందు జర్మనీ భాషలో వ్రాయబడింది.  తరువాత అది ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యబడింది. ప్రపంచమంతా వ్యాపించినది.  

ఆకుపచ్చ కు చాలా రుగ్మతలను తగ్గించే గుణం ఉంది.హరితం కళ్ళకి మంచిందిట. ప్రతి రోజు 10 నిముషాలు చూస్తే ఆకుపచ్చని, రోజు 15 నిముషాలు ఆకుపచ్చ గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే సర్వ రోగాలు పోతాయని రీసెర్చ్ చేసినవారు చెబుతారు. అందుకే రంగును ఆసుపత్రులలో ఎక్కువ వాడుతారు. 

పింకు అంటే లేత గులాబీకి ప్రేమను పెచ్చే గుణం ఉంది. గులాబీ రంగుని కనుక మనం రోజు కొంత సేపు చూసి, ఇష్టమైనవారికి రంగుతో అనుసంధానపరుస్తూ కొంత సమయం సాధన చేస్తే, వారికి తెలియ కూడా వారు మీవైపు ఆకర్షితులవుతారు. లేదా మీ స్నేహం కోరుకుంటారు. 
వైలెట్, అంటే ఉదా రంగు ఆధ్యాత్మికతకు చిహ్నం. రంగును ధ్యానిస్తే మీరు ఆధ్యాత్మిక రంగంలో
ఉన్నతి సాధించవచ్చు. 

అతి కోపాన్ని నీలి రంగుతో కప్పేయవచ్చు. వారిను శాంత పరచవచ్చు. 
అతి నిద్రను ఆరంజ్ తో తగ్గించవచ్చు. రంగులు హీలింగ్లో ఒక ముఖ్య భాగం. రంగులతో హీలింగ్ చేసి, అనేక మొండి రోగములు తగ్గించిన ఘనత ఉంది రంగుల హీలింగ్ చేసే వారికి. 

షట్చక్రాలలో కూడా రంగుల ఉంటాయని, వాటి ద్వారా మానవులకు శాంతి సాధించవచ్చని, సన్మార్గంలో రంగుల శక్తితో జీవించవచ్చని చెప్పేది యోగం. 

రంగులు మానములను ముందుకు నడిపించే శక్తి సాధనాలు. చల్లటి చలిని సాగనంపుతూ, వెచ్చటి రాబోవు కాలానికి స్వాగతిస్తూ, ఫాల్గుణ పౌర్ణమికి ఒకరికి ఒకరు అద్దె గులాబి రంగు స్నేహానికి గుర్తు. జీవితములో సంతోషాని స్వాగతిస్తూ, రాబోవు మంచికాలానికిరా రమ్మనిఆహ్వానం పలకటం. అలాంటి హోలీ నాడు మనలోని మైత్రిని, విశ్వమానవ ప్రేమను పంచుతూ, తేడాలను తుంచుతూ జరుపుకునే రంగుల పండుగే హోళీ. “హోళి శుభాకాంక్షలు”.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s