ఎవ్వరిని పలకరించినా ఊరగాయ కథలు ఊరించి, ఊరించి చెబుతున్నారు. అందరి గోడలకు రంగులు మారి ‘త్రి మ్యాంగో’ కారం తో ఘాటుగా నిండిపోయింది.
మహామహా వంటగాళ్ళ, మామూలు వంటగాళ్ళు, వాసన తెలిసిన వంటగాళ్ళు, బద్దకపు వంటగాళ్ళు అని నాలుగు విభాగాలు చెయ్యాలి అసలు అందరిని.
అందులో అట్టడుగున ఉన్న చివరి రకంకి చెందిన నేను, అంటే – వంటే రాదు కానీ, బద్దకమని ముసుగులో పరువు కాపాడుకునే బాపత్తన్నమాట.
నాలాంటి వాళ్ళకి రోజూ వంటే ఎవరెస్టు ఎక్కటం, మళ్ళీ మనకో ఉరగాయా అని చప్పరించి, వదిలేశాను మర్యాదగా.
మనం వదిలినా, పట్టుకున్న ఇంగువ వాసన వదలవని సామెత. నా అసలురంగు బయట పడకుండా గుట్టుగా వుందామంటే ఆ దేవుడింకోటి తలచాడు కాబోలు.
‘మంచి పెళపెళ ఎండాకాలము, వున్నది హైద్రాబాదుగా అవకాయెట్టుకురా’ అని శ్రీవారు కోరారు. పట్టుకు రమ్మంటే ఎదో ఏడవచ్చు. పెట్టుకు రమ్మంటేనే బాధంతా.
అందుకే నా అవకాయల కథ ఇలా అష్ట వంకర్లు పోయి, చివరకు మా అట్లాంటా చేరుకుంది. కథ ఎటు పోయినా, ఆవకాయ మాత్రం ఇల్లు చేర్చు అనే ఒక కేక వెనక్కాలనే మొగుడు డనేవారి గొంతులోంచి లీలగా.
అది వినిపిస్తున్నా, నాకు మాత్రం ఈ ఆవకాయ మీద పెద్దగా మోజులేదండి, పెద్ద అబిప్రాయం కూడా లేదు.
అసలు అవకాయంత ఈజీ ఊరగాయ మరోటి లేదని నా నమ్మకం.
ఆవకాయ అంటే మామిడి కాయను బాగా అవ నూనె లో ముంచటం కొంత ఆవపొడితో కలిపి నానపెట్టటం. ఉప్పేసుకు మింగటం.
అదేమైనా చంద్రయాన, అంగారకయాన లా అంతరక్షంలో రాకెటు నడపాలా హేమిటి?!!
అదే విధంగా,
మెంతికాయ అంటేనూ , మామిడిని మెంతి పొడి లో ముంచటం…..
మగాయా అంటే తొక్కు తీసి మగ్గపెట్టటం,
అన్నిటికి బేస్ మామిడి కాయానేగామ్మ.
ఇంకా చూడండి…
పసుపు బాగా దట్టిస్తే పచ్చ ఆవకాయ,
కొద్దిగా బెల్లం కలిపితే బెల్లంవకాయ.
సెనగలేస్తే సేనగావకాయ ,
పెసలు పోస్ట్ పెసరవకాయ,
వెల్లులి చల్లితే వెల్లిఆవకాయ,
చితకొడితే పెడితే తొక్కు
పీసంగా పీకితే పులిహోరావకాయ.
ఇంత సింపులు ఈ ఊరగాయలు.
ఎక్కడైనా ఎక్కువ తక్కువగా వుంటే,
మన లోటుపాట్లు కప్పెయ్యటానికి ఇంగువ ఉండనే ఉంది.
ఇలాంటివాటికి వంట రావాలా? చెయ్యి తిరగాలా అన్న నా పెద్ద ఫీలింగ్.
ఇండియాలో బోలెడు రకాల కాయలు, ఎర్రని కారాలు- త్రి మాంగో నేడు ప్రసిద్ధి చెందింది. కానీ గుంటూరు కారం, వరంగల్ కారం ఇత్యాదివి కూడా వున్నాయనుకోండి.
ఇవ్వన్నీ తెచ్చుడు, ముక్కలుగా మామిడిని కొట్టుడు, జాడీలో వెయ్యుడు…. నిండా నూనె నింపుడు,రెండు రోజులు ఏదైనా ట్రిప్ వెళ్లివచ్చుడు.
సరే,జాడీలోకి నింపాక, వాటి వైపు చూడకూడదని ఇంటిళ్లిపాది పోలో మంటూ ఏ తిరుపతో పోయే వచ్చే యాత్ర … ఇది సమ్మర్ స్పెషల్.
ఇంకా చూడుడు…… మీ ఇంట ఊరగాయలు గుమగుమలు… పొరుగు వారి గుసగుసలు…
ఇలాగేగా ఆవకాయ సీజన్లో ట్రిప్స్ అన్నీ అంత ఫేమస్ అయ్యాయి.
ఇవ్వన్నీ నా అపూర్వ అభిప్రాయాలు….
నేను ఏదైనా ఆలోచించి… ఇంతేగా అని చెయ్యటం- రెసిపీ ఆలోచించే చేస్తాను. నా సక్సెస్ రేటు 99%. ఎక్కడో 1% ఫట్టులు.
అలా ఈ ఏప్రిల్ లో ఇండియా మండుటెండలు బారిన పడి, లేచి మామిడికాయలు తెచ్చి నా తెలివి వాడి రకరకాలుగా తరిగి, ఎర్రటి కారం, పచ్చటి పసుపు, ఆవ నూనె, ఇంగువ అన్ని కలిపి ఒక పెద్ద జాడి ని నింపాను.
రెండు రోజులు దాని చూడలేదు. హాయిగా వూరెళ్ళి అమ్మవారిని దర్శించి ప్రశాంతంగా వచ్చాను.
ఒక వారం రోజుల హడావిడి తగ్గాక, ఇంటర్నేషనల్ ప్యాక్ చేద్దామని తెరిచి చుస్తే, అందులో ఎరుపు పసుపు కలయికగా ఆకుపచ్చ ఉడ్భవించింది. మంచి తెలుపు వలయం కూడా మొలకెత్తింది.
“ఇదేంటి, నేనో కొత్త పదార్థం తయారు చేశానా హేమిటి?” అని తొంగి చూశాను.
సైన్స్ ప్రకారం నారింజ రంగు వస్తే, లేదా ఎరుపు డామినెటే చేసి, ఎర్రగా మిగలాలి. కానీ ఇదేమిటి??
ప్రకృతి విరుద్ధంగా, రంగుల థియరీ తిరిగి రాసేలా ఈ ఆకుపచ్చే ఏమిటి? మధ్య ఆ తెల్ల మబ్బేంటి?..
తెల్లబోవటం నా వంతైయ్యింది..😞
మా వంట పిన్నిగారు అన్నారు – “అమ్మయీ! దానిని బూజు అంటారు. మీరు బూజును నిర్మించారు, ఆవకాయ కాదు” అని
ఓహ్… నేను లెక్క ఎక్కోడో తప్పాను సాంబా…..
డామిట్ కథ అడ్డం తిరిగింది.
ప్రయోగం వికటించింది. ఫైల్యువర్ 1% ఇలా సంభవించింది! కటకటా…..
అనుకున్నా.
ఇక మరల ప్రయోగించలేక, ఉన్న సమయం చాలక ఆ పచ్చటి ఆవకాయను ప్రకృతికి నైవేద్యంగా పెట్టి,
అత్యుత్తమమైన పని చేశాను.
అదే సమయంలో “జంధ్యాల వారి పచ్చళ్ళను” ప్రేమతో కొని తెచ్చుకున్నాను.
వారి సౌజన్యంతో ఈ ఏడూ ఎప్పుడు చూడనంత రుచిగా శ్రీవారు ఫ్రెష్ కారం నషాళానికి అంటుతూ, ఘాటు తో స్వర్గానికి బెత్తెడు దూరంగా వున్న రుచులతో ఊరగాయలు ఆస్వాదిస్తున్నా రు అట్లాంటా లోని స్వగృహంలో.
ఈ ప్రయోగం మూలంగా తెలిసినది ఏమిటంటే – బద్ధకం ముసుగు కంటిన్యూ చేస్తూ…. జంధ్యాల వారి పచ్చళ్ళు” తెచ్చుకోవటం ‘బలే హాయిలే’ అని పాడుకోవచ్చును.
ధ్యాంక్స్ జంధ్యాల పికిల్స్!!
ఆవకాయ అదిరింది.
గొంగూర సూపరు. అల్లం ఆహ!! ఓహో…
చింతకాయ చింతలు తీర్చింది. కందిపొడి కమ్మగా వుంది.
మాగాయ మహబెషుగ్గా వుంది.
ఎందరో అవకాయ ఎక్సపర్ట్స్. అందరికి నమోనమఃలు.
ఎల్లరూ అవకాయ భుజించి సుకింతురు గాక!!!