అమ్మకు నివేదన

అమ్మకు నివేదన:

నవ రంద్రాలతో కూడిన కుండ ఇది.

లోపలి దీపపు కాంతి

ఈ రంధ్రాలగుండా ప్రసరిస్తున్నది.

కాని చుట్టూ వున్న మాయను వెలుతురుగా భావించు

అజ్ఞానపు జీవినై

లోపలి వెలుతురు గమనించలేకుంటి!

అమ్మా నీ దాసులము

మమ్ము ఈ మాయనుంచి

పెకిలించు నీ నామ గండ్రగొడ్డలితో

ఒసంగుము శివసానిధ్యమును-

అహకరించు మానవులవు

పశుబుద్ది తో మెసలు మూర్ఖులము

పశుపతి సగభాగానివి

జననీ మమ్మాడించుము నీ కనుసైగన-

మామనస్సు పరమకోతి.

సకల చరాచరమును ఆడించెటి ఆటగత్తేవు నీవు

ఈ కోతికి నీనామము మచ్చిక చేసి ఆడించవే భవానీ!

మనుష్య కోరికలు అనంతము!

సదా సంసారమన్న బురుదను

తెనెగా బ్రమసి,

ఈగల వలే కొట్టుకుంటున్నా మిందు….

ఈ దృతిని సర్వం అని మోహించి, తమితో సలిపెదమెన్నో పాపకార్యాలు,

నీ పాదాల పై వున్న చిన్న దూళి కణమును ఈ జీవిపై జల్లుము తల్లీ!

అజ్ఞానపు అవిద్య తొలగి, నీ పాద దాసినై నీ ధ్యానములో

రమించును..

నీ పాదములుంచుము తల్లీ నాతలపై

సర్వ బంధములు తెగి నీ పాదాలందు ఐఖ్యమవుటకు….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s