నమస్తే
చలి అణువణువు ప్రాకి
స్థంభిస్తూ హృదయా మున్నా,
నిశ్చలమై నిలవ దిగులు పడుతున్నప్పుడైనా
జీవితాని వెలుగు కొరకు
జగన్మాత దివ్య కాంతి కొరకు
తపిస్తున్న క్షణానా…
మిగులు దుఖం… ధైర్యాన్ని హరిస్తున్నా…
చరైవేతి …చరైవేతి…
ఎవరు మెచ్చారని
సూర్యడు పోషకుడయ్యేనీ భువికి?
నెవరు తలచారని మృదల వెన్నెలనందిచను రాకా చంద్రుడు…
అందుకే
చరైవేతి.. చరైవేతి
పుష్పాలు వికసించి సువానలు చల్ల,
చల్సలని సమీరము మరులు కొలుపు
ఎవరు జీతమిచ్చునని వర్షమభిషేకించు ఫృధ్విని?
చరైవేతి.. చరైవేతి…
మధువునందించు తేనియ
క్షీరమందించు గోమాత…
పుష్పించు సుమబాల…
నదులు ప్రవహించు…
పుడమి మీద ప్రాణమున్నంత వరకూ
చరైవేతి … చరైవేతి.