guruvu

సుడిగుండాల సుడులతో,
వరదతో ప్రవహించు నది – ఈ సంసారము।
జీవుడు వరదలో కొట్టుకుపోతున్నాడు గమ్యరహితంగా,
ఈతరాని జీవుడతడు
ఈదలేని జీవుడతడు-
ప్రవాహమున కొట్టుకుపోతున్న జీవుడతడు-
వరదలో నుంచి బయటకు రాలేక
తల్లడిల్లుతూ కొట్టుకుపోతున్నాడు జీవుడు-
పూర్వ పుణ్యమున అమ్మవారి నామము …
దొరికినది అనువుగా జీవునికి…
వదలక తలచెను మంత్రమును
పిలిచెను భక్తిగా అమ్మను..
నామపారాయణమన్న మంత్రం
సంత్సంగమన్న మంత్రం
దాసోహమన్న మంత్రం
కరివరదుని కదిలించు మంత్రం..
వరదనుంచి తప్పించు మంత్రం!
పరమాత్మకు తప్పదు కదా!
వినినంతనే ఆ వేదన
పరుగన వచ్చును గజఈతగానివలె
రక్షించు సద్గురువు రూపములో
వడ్డునుంచి వరదలోకి
దుమికి పట్టును జీవుని..
ప్రవాహములో జీవుడుండును
ప్రవాహములోనే గురువుండునా క్షణమున..

ప్రవాహము జీవుని ముంచును..
కానీ, ఆ ప్రవాహము గజఈతగాని ఏమి చెయ్యగలదు?

గజ ఈతగాడైన గురువు
జీవుని రెక్క పట్టుకు వడ్డుకు లాగును…
ఈ సంసార కూపము నుంచి వడ్డుకు..
భవబందముల నుంచి వడ్డుకు…
జీవన చట్రపంకము నుండి వడ్డుకు
లాగపడ్డ జీవుడు ముక్తుడవ్వును
సద్గురువు ఆశ్రయించిన జీవి
ఈ ప్రవాహము నుంచి తప్పించుకొని
ముక్తుడగును.

Leave a comment