1.సముద్రమంతా త్రాగేయవచ్చు
మేరు పర్వతమును పెకిలించవచ్చు
భగభగ మండు అగ్నిని మింగవచ్చు
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
2.సింహాని బోనులో ఇరికించవచ్చు
ఎడారి ఇసుకలో వరి పండించవచ్చు
హిమవంతముపై అగ్ని రగిలించవచ్చు
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
3.అమవాస్యరాత్రి సూర్యుణ్ణి ఉదయించవచ్చు
దిక్కులను అటు–నిటూ మార్చవచ్చు
అణుబాంబును అంగిట్లో మింగవచ్చు
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
4. సమయాన్ని వెనుకకు త్రిప్పవచ్చు
గ్రహముల నడతను మార్చవచ్చు
భూమి నడతను ఆపవచ్చు
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
5. సూర్యమండలమున కాలు మోపవచ్చు
భూమి చుట్టూ చంద్రులను కొన్ని జతచేయ్యవచ్చు
నక్షత్రాలను చిమ్మి మూటకట్టవచ్చు
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
6.శాస్త్రములను పుక్కిటపట్టవచ్చు,
పూరాణములను తిరిగిరాయవచ్చు,
ప్రపంచమున శాంతి కపోత మెగర వెయ్యవచ్చు,
కానీ
మనసును నిగ్రహించమెవరి తరము?
7.
శాస్త్రము చదవలేదు పురాణములు అసలే రావు
జ్ఞానము వెతికిన లేదు వైరాగ్యమన్న తెలియదు
కాని నా గురువు కృపన, భక్తితో వారి
పాదాల నిలిపిన నా మనసుకు చలనమే లేదు।।