మా చిన్నప్పుడు ఆటలే మా లోకముగా వుంటుంది కదా. ఇప్పటిలాగు లేదు బాల్యం అప్పుడు. ఆడుకోవటానికి మిత్రలే కాని విడియో గేములు జూముబాక్స్ లు లేవు హాయిగా.
అదేంటో రోజుకు 24 గంటలూ వున్నా ఆడుకోవటానికి సరిపోయేవి కావు. అందులో స్కూలూ, చదువు దూరితే చెడ్డ చిరాకు గా వుండేది. ఎదో హోమ్వర్క గీకేసి తుర్ర మందామంటే మాకు కుదిరేది కాదు. మా కాళ్ళ బందాలు తొడగాలనే ప్రయత్నం చేస్తే తప్పించుకు తిరిగేవారము.
అది ఎలాగంటే……
మా నాయనగారు ఆంధ్రా పుట్టి , పెరిగారు. అక్కడే చదువుకొని తెలంగాణాలో వుద్యోగములో చేరారు. అక్కడ చదువుకునే వారందరికి రెండు లక్షణాలు తప్పక వుండేవి. ఒకటి ట్యూషను. మరొకటి సైకిల్. అక్కడ పిల్లలు ఉదయము, సాయంత్రము తప్పక సైకిలు ఎక్కి తుర్రమంటూ ట్యూషన్కు లగెత్తుతారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు అందరూ. వాళ్ళకు మరి బడిలో పాఠాలు చెప్పరో, చెప్పినా వీళ్ళకు ఎక్కడో నాకు తెలియదు.
మా నాన్నగారికి కూడా ఈ ట్యూషన్ పిచ్చి. మాకు స్కూల్లో పాఠాలు అర్దమవుతున్నాయన్నా వినే వారు కారు. మా ముగ్గురికి ఒక వెంకటేషము సారు అనే ట్యూషన్ మాష్టారు ని కుద్చిచారు. ఆయన బి.ఇ.డీ చేసి టీచరుగా ప్రభుత్వ పాఠశాలలో చేరే ప్రయత్నం లో వుండేవారు. అందుకుని ఆయనను మా నాన్న మాకు ట్యూషన్ ఇంటికొచ్చి చెప్పమంటే సంతోషంగా వచ్చేసారు.
ఏ రోజూ ఆయనకు , మాకు చెప్పటానికి పెద్దగా వుండేది కాదు. ఆయన వచ్చే సరికే మేము చేసి రెడీగా వుండే వాళ్ళము మా హోమ్వర్కు చేసి. ఆయన వచ్చి చూసి సరే అనగానే తూనీగలా ఎగురుతూ మాయమయ్యేవాళ్ళు నేను ముందు, నా వెనక తమ్మడు. అక్క మాత్రం వుండిపోయేది పాపం. తను ఆయనకు మర్యాద ఇచ్చి ఆయన వెళ్ళాకనే ఆటలలోకి వచ్చేది. ఆయన మాకు ఒక సంవత్సరం చెప్పాడేమో అలా. తరువాత ఏడాదికే ఆయన డ్రీమ్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు.
నాన్నగారు మళ్ళీ ఇంకోళ్ళని పట్టుకొచ్చారు. ఆయాన ఏడాది కల్లా ప్రభుత్వ వుద్యోగములో చేరిపోయారు. ఈ లోగా మేము ట్యూషన్ వద్దని అమ్మ దగ్గర గోల ఎక్కువ చేశాము. కానీ నాన్నగారి ఉద్యేశములో మార్పులేదు. ఆయన మళ్ళీ మాష్టార్ల కోసం చూసుకుంటునే వున్నారు. తప్పించుకోవాలని మేము, ముక్యంగా నేను ప్రయత్నస్తూనే వుండేదాన్ని.
ఈ లోగా మా వూర్లో మాకు ట్యూషన్ చెబితే వాళ్ళకు వారు కోరుకుంటున్న ఉద్యోగం వచ్చేస్తుందని మాట వినపడటం మొదలయ్యింది.
ఇంక మాష్టార్లు నాన్నతో మాటలు. మేము వస్తామంటే మేమని.
దానికి తోడు నాకు స్కూలో వచ్చే మార్కులకు పెద్దగా మెచ్చుకోలు పోయ్యింది.
“ఆ! ట్యూషను వుందిగా నీకు రాకపోతే ఇంకెవరికి’ అంటూ నా మిత్రులు నన్ను అనటము మొదలెట్టేశారు. ఆటలలో ఫ్రెండ్స్ కూడా నన్ను పిలవకుండా ముఖ్యమైన ఆటలాడుకోవటము.
నేను ఇలా వెళ్ళి అలా వచ్చే సరికే మొదలెట్టేసెయ్యటము. నేను ప్రక్కన కూర్చొని ఎదురుచూడటం. మా చెడ్డ చిరాకొచ్చేసేది.
అందుకే ఎంతగా హంగర్సైక్టు చేసినా
ఒక ట్యూషన్ చెప్పే స్కూల్లో చేర్చారు. మా స్కూలు అయ్యాక అక్కడకు వెళ్ళాలి. నా టెంత్ క్లాసు వరకూ ఇలా ట్యూషన్బారిన పడ్డాను.
అందుకే మా అమ్మాయి కుమాన్( అమెరికాలో పిల్లలు కుమాన్ కు వెళ్ళి లెక్కలు చకచకా చెయ్యటము ప్రాక్టిసు చేసుకుంటారు) వెళ్ళనంటే వెంఠనే మానిపించాను.
మా ట్యూషన్ మాష్టారు ఎమీ చెప్పేవారో గుర్తుకు లేదు కానీ ఆయన కుడి చేతికి గడియారము పెట్టుకునేవారు. నాకెంతగానో నచ్చి నేనూ రిస్టువాచ్ నా కుడిచేయికి పెట్టుకోవటం మొదలెట్టా. ఇప్పటికీ అదే అలవాటు.