నా కోతికొమ్మచ్చి -10

పుస్తకాలు – పుస్తకాలు

అమ్మ గుంటూరులో పెరిగింది. తను పాపం 8 వ తరగతిలో వుండగానే పెళ్ళి చెసేశారు తాతగారు. ఆమె పెళ్ళి అయినా చదవు కొనసాగించింది. హింది విశారద పూర్తి చేసింది. ఓపెను యూనివర్సిటి పెట్టాక అందులో బియే పూర్తి చేసింది. ఆమె గుంటూరులో చదివిన స్కూలు కాన్మెంతటు బడి. ఇంగ్లీష్ మీడియం లో చదివింది.

చాలా చదివేది ఆవిడ. ఎప్పుడూ ఒక పుస్తకము చేతి లో వుండాల్సిందే. ఎన్నో చదివి ఎక్కడెక్కడి వింతలూ మాకు చెప్పేది.

ప్రతి మధ్యహానము కొంత చదివి, ఆ సాయంత్రము ఆ విశేషాలు చెప్పేది. ఎన్ని కథలో, ఎన్ని కబుర్లో.

ప్రతి రోజు దిన పత్రిక తెలుగు, ఇంగ్లీషు, ప్రతి వారము వార పత్రిక వచ్చేవి. ఇవి కాకుండా మాకోసం చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి వచ్చేవి. మాకు చదవటము రాక ముందు నుండి ఇవి వచ్చేవి. మమ్ములను మధ్యహానము ప్రక్క కూర్చోబెట్టుకొని చదివి వినిపించేది.

మాకు చందమామ కథలలో ఎన్ని సందేహాలో. భట్టి విక్రమార్క కథలు అంతూ పొంతూ లెకుండా అలా వస్తూనే వుండేవి. ఆ కథలలో చివరకు ఎదో ఒక జంతువుగా మారి అడివిలోకి పోతుంటాయి. మా ఇంట్లో నుంచి అడవిలోకి పోతాయేమో అని భయం. అవి పుస్తకము లోంచి ఇంట్లో కొస్తాయోమో నని భయపడి ఆ పేజీ మూసేసి, తరువాత పేజీలోకి వెళ్ళెవారము.

మా ఇల్లు పుస్తకాలకు, వేద పండితులకు పేరుగా వుండేది.

పిల్లల పుస్తకాలు అన్ని వుండేవి. మా ఇంటి చుట్టు ప్రక్కల పిల్లలందరికి మా ఇల్లు ఒక గ్రంధాలయము. అందరూ వచ్చి చదువుకునేవాళ్ళు. మేము ఇంటి కి మాత్రం తీసుకురోవద్దనే వారము. ఎందుకంటే అవి రావు కాబట్టి.

ఆ పుస్తకాలు చదివే అలవాటు అప్పట్నుంచి అలా పెంచిపోషించ బడింది.

విపుల, చతుర కూడా వచ్చేవి కాని అవి

చూడటానికి కూడా బావుండేవి కావు ఎందుకో. పుస్తకాలను అవే కాకుండా మేము హైద్రాబాదు లో సోకల్‌ లైబ్రరీలో వున్న నవలలన్నీ నేను ఒక సమ్మర్‌ హాలీడేస్‌ లో వూడేశాను. ఆ షాపు అతను భయపడి, ఎన్ని నవలలు చదువుతారు రోజుకు అన్ని నన్ను అడగటం గుర్తుకువస్తే నవ్వు ఆగదు నేటికి కూడా.

మా అంతట మేము చదవటము వచ్చాక ముందు ఎవరు చదవాలని గొడవ వచ్చేది. నేనంటే నేనని. లాక్కోవటం గొడవ పడటము ఇంట్లో సర్వసాధారణము. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదంటే అది విసురుకో టం, ఇల్లు ఎప్పుడూ కిష్కిండలా వుండేది.

పుస్తకాలు చదివిటప్పుడూ, నాన్న ఇంట్లో వుంటేను మేము చాలా శాంతం పాటించేవారము.

మిగిలిన కాలమంతా డిష్యిుమ్‌ డిష్యుమ్‌ లే. అందుకే ఎక్కువ పుస్తకాలుంటే తగవులుండవని చదినన్ని పుస్తాలు తెచ్చి పడేసేవారు.

స్కూల్లో వుండగా షాడో నవలలు పిచ్చగా చదివేవారము. అనీ రెంటు తెచ్చుకొని. తరువాత పెద్దఅక్క, పిన్ని తెలుగు సాహిత్యపు రీసెర్చు చేస్తూ తెచ్చిన అన్ని సాహిత్య విశేషాలు చదువుతూ తెలుగు సాహిత్యం మీద కనిపించని ప్రేమను పెంచుకున్నాను.

ఈ చదివటమన్నది మాత్రం చిన్నతనములో పడింది. ఆ బీజమే నేడు మహావృక్షమయ్యింది ఇలా.

Leave a comment