వంటగది ప్రతి గృహానికి గుండెకాయ వంటిదంటారు. ఆహారము అక్కడే కదా తయారయ్యేది. ఆ ఆహారము మానవులకు ప్రాణము నిలుపుటకు ఇందనము ఆ జాగ్రత్త. కాబట్టి వంటగది పరిశుబ్రము చాలా ముఖ్యము. పరిశుభ్రము ఎంత ముఖ్యమో, చేతికి అందుబాటులో వస్తువుల అమరిక అంతే ముఖ్యము.
అందునా నేటి జీవన విధానములో మనము గంటల కొద్ది సమయము అక్కడ గడపలేము కదండి.
అందుకే నేటి మాడ్యూలర్ వంటిల్లు వచ్చింది. ఈ టైపు వంటగదిలో పొయ్యి, సింకు , ఫ్రిజ్ లను ఒక త్రికోణములో అమర్చి మధ్య అడంకులు లేకండా చూస్తారు. వాటిని హైట్రాఫిక్ అంటారు. మనము ఎక్కువగా ఈ మూడింటి మధ్య తిరుగుతాముట వంట పనిలో.
అలాగే నేడు దొరికి వివిధ చిన్నా పెద్ద పరికరాలు వాడకముకు వీలుగా వుండాలి వంట ఫ్లాటుఫామ్. అంటే మిక్సీ, వెట్గ్రెండరు వంటి వివిధ కరెంటు పరికరాలకు సరిపడా పవర్పాయింట్లు వుండాలి. వంటల లో వాడే గిన్నెలు పెట్టుకున్నెందు సరిపడు గట్టు(కౌంటరు స్థలము) ఇత్యాదివి కూడా వుండాలి. వంట సామాను కు సరిపడా అలమారలు వుండాలి. వంట వండినప్పుడు వచ్చే వాసనలు బయటకు పంపే మంచి exhaust fan కూడా చాలా ముఖ్యము. వీటితో కూడి, చూడటానికి అందము, వాడుకకు సులువు వున్న వంటగది ప్రతి గృహానికి అత్యవసరము.
కాని, చాలా సార్లు ఇంటి డిజైన్ చేసేటప్పుడు వంటగదికి తగిన ప్రాముఖ్యతనివ్వరు. మిగిలిన గదులు డిజైను చేశాక మిగిలిన స్థలాన్ని వంటగదిని సర్దుతారు. కానీ వంటగది ని డిజైను చేసి తరువాత మిగిలిన గదులు డిజైను చూడాలి అన్నది నిజము. భారతదేశములో వంటగదిల పరిస్థితి మరీ ఘోరంగా వుంటుంది. చిన్న గట్టు, దానికి సరిపడే అంతే స్థలము. ఇద్దరు మనుష్యులు అటు ఇటూ కదలాలంటే పరమ ఇబ్బంది వుండే గదులు కోకొల్లలు.
అట్లాంటాలో మా వంటిల్లూ చిన్నదే. నాకు చాలా ఇబ్బందిగా వుండేది. దానికి తోడు అది త్రిభుజము గా కట్టడానికి చాలా ప్లేస్ ను వృద్ధా చేశారు. నాకు వంటగదిలో ఇష్టమైన ఫీచరు వంటగది మధ్యలో కట్టుకునే టేబుల్ వంటి ఐలాండు. అదీ మా వంటిట్లో లేదు. పైపెచ్చు పులోవరు సొరుగులు లేక మేము పాకుతూ లోపలివి అందుకోవటము పరమ ఇబ్బందిగా వుండేది వ్రతి ఉదయము. ఇన్ని కారణాల వలన ఆ వంటిల్లు నాకు త్రీవ్రమైన అసంతృప్తి నిచ్చేది.
వీటికి సమాధానమే మా వంట్టిలు రీమోడల్, తిరిగి మొత్తము మార్చి కట్టుకోవాలని నిర్ణయించుకున్నాము.
అందుకుగానూ మేము చాలా మంది వంటగదిని కట్టె కంపెనీలను చూసాము. వారు చెప్పే కోటు విన్నాక కళ్ళు తిరికి బొక్కబోర్లా పడి, చివరకు ఒక కాంట్రాక్టరు సహాయము తీసుకొని మేమే కట్టుకుందామని నిశ్చయించుకున్నాము.
మా వంటింటికీ, భోజనాల గది కి మధ్య గోడ తీసివేసి మొత్తము ఒక గదిగా మార్చి, కట్టాలన్న ప్లానును నిశ్చయించాము.
ఆ గోడ తీసెయ్యటానికి, పైపు లైను మార్చటానికి, కరెంటు వైరులు లాగటానికి మా కాంట్రాక్టరు రెండు వారాలు తీసుకుంటే, పూర్తిగా చెక్క ఫ్లోరు వెయ్యటానికి, కూల్చిన గోడలు లో కొత్త గోడలు కట్టటానికి, గోడలకు కొత్త రంగు లద్దటానికి మరో రెండు వారాలు తీసుకున్నాడు.
ఈ నాలుగు వారాలు వంటిల్లు కాదు కదా, అసలు నీటి సరాఫరా లేక, ఈ గోడలు పీకటము, తిరిగి కట్టటము మూలంగా వచ్చిన దుమ్ముకు మేమిద్దరమూ దగ్గుతూ తుమ్ముతూ, చీదరగా, చికాకుగా “ఎందుకొచ్చిన రీమొడలింగురా దేవుడా!!” అంటూ ఆక్రోశించాము. గజిబిజిగా కాలక్షేపము చెయ్యవలసి వచ్చింది. ఇంట్లో వంట లేదు. తినటానికి తిండిలేదు. ఎంత బయట్నుంచి తెచ్చుకున్నా, మేము చాలా ఇబ్బంది పడ్డమాట నిజము.
వంటిల్లు కు క్యాబినెట్లు ఐకియా నుంచి తెప్పించుకున్నాము. న్యూజర్సి లోని ఐకియావారి వేరుహౌసు నుంచి మాకు అవి రావటానికి దాదాపు పది రోజులు పట్టింది. అవి మొత్తం డెబై డబ్బాలు. ఇల్లంతా నిండి పోయాయి. వాటిని విడకొట్టటానికి ఏ భాగానికి ఆ భాగముగా విడదీసి కట్టటానికి మేము డిజైను చేసుకున్న వంటింటి నమూనాను ప్రింటు చేసి, డిజైను ప్లాను ను వాడుకున్నాము. అంటే ఏ క్యాబినెటు ఎటు వెళ్ళాలి, ఏ సొరుగు ఎటు పెట్టాలి వంటివి.
కౌంటరు మీదికి పాలరాయిని పోలిన క్వాడ్జ్ ను ఎంచుకొని తెచ్చుకున్నాము. దాని పేరు ‘కలకత్తాలాజా’. క్యాబినెట్లకు హార్డువేరు హనీ సెలక్టు చేసింది. పది రోజులు తరువాత, అంటే రీమోడలను పాత వంటగదిని బద్దలు చేశాక, నెల పైన రెండు వారాలకు కొత్త క్యాబినెట్ వచ్చింది.
శ్రీవారు తిండి నిద్ర మానేసి మరీ ఐదు రోజులు బిగించారు. అయినా కాలేదు. నేనూ, మా అమ్మాయి కూడా ఇతోదికంగా చేయ్యేశాము. కొన్ని చిన్నచిన్న బిగించడాలు శ్యామ్యులు అన్న హెల్పురు సహాయము చేశాడు.
మొత్తానికి మాకు రెండు వారాలు పట్టింది పూర్తిగా సెట్టు చేసుకోవటానికి. అంటే రెండు నెలలకు కొత్త వంటగది వాడకములోకి వచ్చింది.
మారిన వంట గది ఇంటి రూపు రేఖలనే కాదు, ఇంటి విలువను కూడా గబాలన పెంచింది. చక్కటి తెల్లని గోడలకు, ఆ గచ్చకాయ రంగు క్యాబినెట్లు, ఆ అద్దాల అలమారలు మదిని దోచేస్తూ అలరిస్తున్నాయి.
అత్యంత ఆధునాతకంగా, అన్నీ అందుబాటులో అమర్చుకొని ఇష్టమైనవి ఇష్టంగా పొందికగా వున్న కొత్త వంటగది మాకు ఇప్పుడు ఇంట్లో ఎక్కువగా గడిపే ఫెవరేటు స్థలము. అంటే మా వంటి గదిలో రెండు ఐలాండ్లలో మొదటిది పని చేసుకోవటానికైతే, రెండవ దాని చుటూ మేము చేరి మా ఉదయపు సూర్యోదయ కబుర్లు, సాయంత్రుపు టీ తో ముచ్చట్లుకు కేంద్రముగా మారి అలరిస్తోంది.
పి.స్. ఎవరైనా ఐకియా వంటిల్లు క్యాబినెట్లు బిగించుకోవాలంటే, మా శ్రీవారిని పనికి పిలవొచ్చు:)