ఆ వీణారవము-
సామ వేదానికి సరిగమలు అద్దుతుంది.
గాన గంధర్వులకు గమకాలు నేర్పుతుంది
మధుర మంజాషములకు అమృతము చల్లుతుంది
కఠన పాషణ హృదయానికి ఆర్రత్థ అద్దుతుంది.
సేద తీర్చే అమ్మ వడి – ఆ రవళి
అప్యాయంగా హత్తుకునే నేస్తం
మద్దులొలికే తనయ – గారాలు పోయే చెలి
ఆ వీణ గానము
మంద్రంగా వినిపించే మధుర మందాకినీ,
జల జలా కురిసే సుధా ఝరి
ఉప్పొంగే గోదావరిలా పొంగి, మన హృదయాలను తడిపి
మనలను పరమానందమొనరిస్తుంది
మనలను మరో లోకాలకు తీసుకుపోయే అంతటి అద్బుతపు నాదము మనకు అవిష్కరించి
మనకు అమృతపు రుచిని అందించెందుకు విచ్చేసిన పుంభావ సరస్వతి శ్ర వడలి ఫణి నారాయణ.
వీరి వంశంలో ఏడవ తరము వారైన వీరు, తల్లి తండ్రుల వద్ద సంగీత లో ఓనామాలు నేర్చినా,
వీణ వీరికి సహజ ఆభరణములా అమరింది.
సప్తస్వరాలలో, 24 మెట్ల మీద మయాజాలము చేసి మన మీద సమ్మోహన మంత్రం చల్లి మన అభిమానాన్ని గాలం వేసి టోకుల లెక్కన తీసుకుపోతారు.
వీరి ముందు ఎంత కఠనమైన రాగమైన ఆయన చేతిలో మురిసి మూర్చనలు పోవలసినదే,
వొదిగి హోయలందించ వలసినదే.
అది విని మనము మైనములా కరిగిపోవలసినదే!
గమకాలకే గమకాలు నేర్పే ఆ నేర్పుకు, లయకు నిలయమైన
ఆ పీయూష నాదములో మన ఆత్మలు తడిసి, మనము కరిగి నీరై,
ఆనందతాండవమాడవలసినదే!!
ఆ నాద బ్రహ్మకు నీరాజనములు ఇవ్వవలసినదే!
మనసులు కరిగి కైమోడ్పులు పట్టవలసినదే!!
ఆధాటికి మనము మన వునికిని కోల్పోయి ఈ వైణికునికి దాసోహమనవలసినదే!!
ఆ కళామ తల్లి కిరిటములో మణిలా వెలుగొంది,
అంతర్జాతీయ స్థాయిలో విపంచికి పేరు తెస్తున్న వీరికి నమో నమః🙏🏽🙏🏽