రెండు రోజులుగా జర్వం.
మూడో రోజుకు అసలు లేవలేకపోయాను. ఉదయమే లేచి జపతపాదులతో పాటూ కాఫీ టిఫినూ రెడి అయ్యాక, అప్పుడే నిద్ర లేచి వచ్చే పతి మహారాజు సేవలకు అంతరాయము కలిగింది. ఉదయము లేస్తే నాకు విపరీతముగా చలివేసి అలానే పడుకుండిపోయా.
ఇతను మాములుగా 9దింటికి లేచి నేను లేవకపోవటము గమనించి అడిగాడు’లేవలేదేమిటి?’ అని
నేను మూలుగుతూ ‘చలిగా వుంది. జర్వం’ అన్నా.
తను తెగ ఫీల్ అవుతూ ’అయ్యో పడుకో. నే కాఫీ టిఫిన్ల సంగతి చూస్తా. నీవు గంట తరువాత కిందికి రా’ అని వెళ్ళిపోయాడు.
మగత అనిపించింది. ఎం గందరగోళము చేస్తాడో,ఎమిటో …భయంగా వుంది, అయినా ఓపికలేదు.
మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి.
నిద్రలో ఉలికిపాటు.
లేచి తూలుతూ అలాగే వెళ్ళాను క్రిందకు. మా పడగది పైన వుంటుంది. వంటగది ఇత్యాదివి క్రింద వున్నాయి.
వెళ్ళి చూస్తే మా వంటగదిలో నాలుగు సునామీలూ, ఐదు తుఫానుల తరువాతి పరిస్థితి నెలకొని వుంది.
నాకు నిరసము హెచ్చింది అది చూసి.
డిష్వాషరులో గిన్నెలన్నీ వంటగది గట్ల మీద పరుచుకున్నాయి.
ఒక ప్రక్క కాఫీ డికాషను మడుగు కౌంటరు మీద.
మరో పక్క పోయ్యి మీద టీ వలికి ప్రవహించి గడ్డకట్టింది.
మరో ప్రక్క అంట్ల గిన్నెలు సింకు నిండా వున్నాయి.
ఒకవైపు హీటరు మరో వైపు ఎగ్జాస్టురు పెద్ద చప్పుడు.
కుక్కరు కుయ్యి మంటోంది ఏముందో అందులో.
మిక్సీ మీద క్రిందా దినుసులు నలిగి నలగిని పచ్చడి అవశేషము పడి వుంది.
వీటి మధ్య శ్రీవారు రణరంగములో అపర అభిమన్యుడులా యాప్రాను కట్టుకు చుట్టూ తిరుగుతున్నాడు.
******+
నన్ను చూసి ‘అప్పుడే లేచి వచ్చేశావేంటి’ అన్నారు.
నేను ‘ఇదేంటి ఇంత ఆగము? నే లేచి వచ్చే వరకూ ఆగవా?’ అడిగాను.
‘నీవలా కూర్చో. నిముషాలలో అన్నీ సెట్ రైటు’ అని భరోసా.
‘కాఫీ డికాషన్ ఎందుకు క్రిందపోయ్యింది?’
‘కాఫీ కలుపుకుందామని తీసి ప్రక్కన పెట్టానోయి, ఇంతలో ఇలా కారిపోయ్యింది’
“టీ ఏంటి పొయ్యి మీద వలికింది’
‘చూడలేదోయి, క్లీన్ చెస్తేస్తానుగా’
‘పచ్చడి ఏంటిది? ఊరగాయలు చాలా వున్నాయిగా’
‘అబ్బబ్బా..నీ కోర్టు ప్రశ్నలు ఆపి టిఫిను తిను. ఇడ్లీ చేస్తున్నా’ అన్నాడు తను విసుగ్గా
‘ఇడ్లీ ఎలా వేశారు’ భయం ముదిరింది నాకు.
‘పిండి ప్రిజ్ లో వుందిగా’
‘వుంటే….దానికి నీళ్ళు కలిపారా’ కీచుగా అడిగాను.
‘దానికి నీళ్ళు కలపాలా’ తిరిగి ఎదురు ప్రశ్న.
నేను భయంతో మూల్గదానికి కూడా వోపిక లేక తలవూపి వూరుకున్నా. దేవుడి మీద భారం వేసి.
మనము పిండిని గట్టిగా రుబ్బుకొని వాడేటప్పుడు నీరు కలుపుతాముగా. ఈయనకు తెలియదు. ఆ పిండిని అలా సుద్దలుగా ఇడ్లీ ప్లేటులో సర్ది పోయ్యి ఎక్కించారు.
తీశాక చూస్తే అవి పేపరు వెయిట్స్ లా వున్నాయి గట్టిగా. వాటితో పాటు తినటానికి సుత్తి లేదా గుండ్రాయి ఇవ్వాలి చెంచా బదులు. అంత గట్టి ఇడ్లీ చూసి వుండరు ఎవ్వరూ.
నేను ఇడ్లీ తిననంటే కోప్పడట మొకటి.
‘నీకు రోగమొచ్చిందని ఇడ్లీ చెస్తే తిననంటావేమిటి’? అని.
నే గట్టిగా తిననంటే ఆవి తీసి విసిరితే నా ముఖం పగం గ్యారంటీ లా వుంది వాలకము. . తినటానికి పోతే పళ్ళు ఉడటం గ్యారంటి.
హేమిటి చెయ్యటము??
ముందు చూడబోతే
నెయ్యి వెనక చూడబోతే గొయ్యి. మా తమ్ముడికి ఒకడికి కోకో అనుకోగానే కక్కులు వస్తాయి. వాడిని తిట్టాలంటే పిన్ని వాడిని ఒరే వేవిళ్ళపక్షి ఇలా రా! అంటూ కోప్పడేది. వాడిని నేను ఒకసారి అడిగా కూడా.
‘అలా కోకో అనుకోగానే ఎలా కక్కేస్తావురా?’అని
వాడు శతకోటి ఉపాయాలు చెప్పాడు కాని అవసరానికి ఒక్కటీ గుర్తుకు రావటముసేదు కర్మ!
టీ ని కుడితితో పోల్చి – కుడితిని అవమానించలేము.
కాఫీ డికాషను వేసికోవటాని తగినంత పొడి వెయ్యక అది నలుపు నీరులా వుంది.
‘మీరు తినండి ఇడ్లీ. నాకు కక్కు వచ్చేలా వుంది, నోరు చేదు’ అన్నాను ముఖము వికారంగా వంకలు తిప్పుతూ అప్పటికీ తప్పించుకునే ప్రయత్నంలా.
మొబైల్ లో పోతున్న సిగ్నలా నా వేషాలు సాగటంలేదు.
ట్రంపు ఇంపీచ్‌మెంటు కుదురుతుందేమో గానీ నేను ఇడ్లీ రాళ్ళ నుంచ తప్పించు కోవటం కుదరటంలేదు.
ఆ ఇడ్లీ నోట్లో పెట్టుకొని బాత్రూమ్ సోకి పరుగెత్తా.
పెద్దగా రెండు సార్లు ‘బే బే’ అని కేకలు పెట్టి బయటకు వచ్చి
‘చెప్పాను కదా వామిట్ చేసేశాను’ అని చెప్పి ఆ కంపు టీ త్రాగలేక వచ్చి సోఫాలో పడ్డాను.
నీరసంగా అనిపించింది.
అలా నానా బీవత్సమైన ఆ ఉదయపు టీ కాఫీ టిఫినలలో ఘోరంగా దెబ్బతిని, తినలేక, కక్కలేక నీరసించి వచ్చి సోపాలో పడ్డాడు శ్రీవారు.
అప్పటికినే నీరసం మీద ఇది మాములు రూపుకు తెచ్చుకోలటానికి కావలసిన టైం గురించి ఆలోచిస్తూ నేను స్పృహ తప్పాను పూర్తిగా।।