#అమ్మఆలోచనలు
కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పుర్వాశ్రమంలో అమ్మ భక్తులలో ఒకరు.
వారు జిల్లేళ్ళమూడి వెళ్ళినప్పుడు వారితో కృష్ణబిక్షు అన్న బాగవతోత్తముడు కూడా వచ్చాడు. ఈ కృష్ణభిక్షు గొప్ప సాధకుడు. ఆయన భగవాను రమణ మహర్షిని, కావ్యకంఠ గణపతి ముని ని కూడా సేవించుకున్న పుణ్యాత్ముడు.
ఆయనకు కొన్ని విషన్స్ వచ్చేవి. దానికి తోడు ఆయనకు తర్డు (మూడవ నేత్రం) ఐ జ్ఞానం ఉండేది. ఆయన గురువు ఆయనను అడిగారుట “అమ్మ గురించి చూడు” యని.
గురువు మాట ప్రకారం చూసిన కృష్ణబిక్షుకు అమ్మ ఆ పైన ఉన్న లోకాలలో దేవి యని, ఆమె స్వయంగా రాజరాజేశ్వరి యని తెలిసింది.
ఈ విషయం అమ్మ దగ్గర ప్రస్తావిస్తే విననట్లుగా ఊరుకుంది, అమ్మ. అమ్మ ఎప్పుడూ తనో దేవత అని చెప్పలేదు. “నేను అమ్మను. మీరంతా నా పిల్లలు” అనేది. అలాగే చూసింది కూడా.
కృష్ణభిక్ష చెప్పిన దానిని బలపరుస్తూ ఎన్నో జరిగి ఉండవచ్చు.
ఒక్క ఉదాహరణ
అమ్మ ఒకసారి తెనాలిలో బంధువులందరి బలవంతపైనా రెండవ ఆట సినిమాకు వచ్చింది.
సినిమా మధ్యలో సగం ఉండగా రవి అన్నయ్య గొడవ భరించలేక రవి అన్నయ్యని ఎత్తుకొని, హేమక్కయ్యని నడిపించుకుంటూ వచ్చి రిక్షా ఎక్కింది.
రిక్షా కొంత దూరం వెళ్ళాక చీకటి రోడ్డు మీద ఆపి “మీరు దిగవలసినదిక్కడే. దిగండి!” అన్నాడు రిక్షాఅబ్బి.
ఆ రాత్రి పూట అమ్మని, ఇద్దరు పసిపిల్లలతో ఉన్న ఆమెను అలా వదిలివెయ్యటంలో ఆ రిక్షా అతని ఉద్దేశ్యం ఏమిటో మనకు తెలియదు.
అమ్మ “సాంబయ్యా” అంది.
గొడ్డలి పట్టుకున్న మనిషి వచ్చి, రిక్షా అతనికి దారి చూపుతూ వచ్చాడు. అమ్మ ఉన్న ఇల్లు సమీపంలో అతను మాయమయ్యాడు.
అమ్మ ఏమీ ఎరుగనట్లుగా లోనికెళ్ళిపోయింది. ఈ లీల రవి అన్నయ్య(అమ్మ చిన్న కుమారులు) చెప్పారు. దీనికి ఆయనే సాక్షిగా నిలచారు.
అపర లలితాదేవికి సాంబశివుడు కాక ఎవరు ఉంటారు ప్రక్కన? లేదా ఏ రుద్రగణాలో అయి ఉండవచ్చు.
అమ్మ మానవ రూపములో భూమిపై సర్వ ప్రాణినీ రక్షించటానికి వచ్చినదే తప్ప మరోటి లేదని ఈ విషయం స్పష్టమవుతోంది.
జగదంబా సదా నీ పదములు విడువక నిలిచే దృష్టిని ప్రసాదించమని ఆ విశ్వజననినే ప్రార్థిద్దాము.
ఏదైనా ఇవ్వగలిగినదే కేవలం అమ్మే!!
జయహో మాతా!