3స్వామి పరమహంసయోగానంద రమణుల ఆశ్రమం సందర్శించారు.
వారు రమణులతో సంభాషణ
స్వామి:
ప్రజలను ఆధ్యాత్మికంగా ఎట్లా ఉద్ధరించాలి? వారికి నేర్పవలసినవుి ఏమిటి?
మహర్షి: బోధ అందరికీ ఒకే విధంగా చెయ్యలేము. వారి ప్రకృతి, పక్వత బట్టి ఉంటుంది.
స్వా : లోకంలో ఇంతటి బాధ చూస్తూ భగవంతుడు ఎందుకు ఊరుకున్నాడు?
ఒక్క దెబ్బతో రూపుమాపవచ్చుకదా
మ: బాధ ద్వారా భగవద్దర్శనం కలుగుతుంది
స్వా: దాన్ని మార్చి వేరే విధంగా చెయ్యనక్కల్లేదా?
మ: అదే మార్గం
స్వా: యోగం, మతం విరుగుడు కాదా?
మ: బాధను అధిగమించటానికి సహాయపడతాయి
స్వా అసలు బాధ ఎందుకుండాలి?
మ: ఎవరు బాధపడేది? బాధ అంటే ఏమిటి?
స్వామి మాట్లాడలేకపోయారు