4.#అమ్మఆలోచనలు
అమ్మ వివరించేవి చాలా లాజిక్ తో కూడి ఉంటాయి.
రాజు అమ్మ భక్తుడు. అతను మొదటిసారి వెళ్ళినప్పుడు అమ్మ భోజనానికి రమ్మంది.
పొట్లకాయ కూర అమ్మే వండింది.
రాజు అమ్మతో తను పొట్లకాయ తిననని చెప్పాడు.
“ఏం నాన్నా! సహించదా?”
“సహించక కాదు. న్ను పాము మంత్రం సాధన చేస్తున్నా. తినవద్దన్నారు “
“దానికీ దీనికీ సంబంధం లేదు నాన్నా. పొట్లకాయ రక్తవృద్ధి. రుచి ఆరోగ్యం కూడా. తిను నాన్నా”
“నిషేద్ధం అమ్మా”
“మంత్రం బాగా జపిస్చున్నావా? ఎవరికైనా వేశావా?”
“లేదు”
“సిద్ధి పొందిందా?”
“తెలియదు. జపిస్తున్నా అంతే”
“పొట్లకాయ తింటే ఏమౌతుంది?”
“తింటే పనిచెయ్యదు”
“దానికీ దీనికి సంబంధమేమిటి?”
“తెలియదు. బహుశా పొడుగ్గా ఉండి పాములా ఉంటుందని కాబోలు”
“చూడు నాన్నా! నీవు నిరంతరం జపం చేస్తున్నావు. కూరు తినటం వలన మంత్రం నిర్వీర్యం అవుతుందని నీ ఉద్దేశం. అంత శక్తి పొట్లకాయ కుంటే ఆ మంత్రం వదిలేసి పొట్లకాయ జపం చెయ్యి. మంత్రం పని చెయ్యకపోతే పొట్లకాయకు, చింతకాయకు పనిచెయ్యని మంత్రం వద్దు. దానికంటే పొట్లకాయే నయం. రక్తశుద్ధి చేస్తుంది”.
అమ్మ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు.
అవును. అలా పనిచెయ్యని మంత్రాల కన్నా అమ్మ పాదాలనే మంత్రం లా జపిస్తే ఆ పదములే దాటిస్తాయి భవసాగరము.
జగదంబా పొట్లకాయ మంత్రాలు మాకొద్దు. నీ పదములు విడవక ధ్యానించే బుద్ది కూడా నీవే ప్రసాదించని ప్రార్థిదాం!
జయహోమాతా!!
Sent from my iPhone