#అమ్మఆలోచనలు
ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షిని సందర్శించాడు. ఆభక్తునికి రమణుల ఉపదేశమైన “నిన్ను నీవు తెలుసుకో?” అన్న విచారమార్గం నచ్చదు.కాని ఆయన మిత్రులు రమణుని సందర్శించ నిశ్చయించుకున్నారు. అందుకని వారితో కలిసి అరుణాచలం వచ్చాడు. రమణాశ్రమములో రమణమహర్షిని సందర్శించాడు. ఆయన భగవాను వద్దకు వచ్చాడు“భగవాను మీరు “నిన్ను నీవు తెలుసుకో” అని చెబుతారు. నాకు తెలుసు. ఆ మార్గం నాకు నచ్చదు. నాకు దేవుడి మీద భక్తి ప్రేమ ఉన్నాయి. నారాయణుడు సర్వం. ఏకో నారాయణ. ఇది చాలా?”భగవాను చిరునవ్వుతో “చాలును” అన్నారు.ఆ భక్తుడు ఆనందంతో “భగవాన్! నారాయణుడి మీద నాకున్న భక్తి, ప్రేమలతో నేను మరణాంతరం వైకుంఠం వెడతానా?”
“భగవాను అదే చిరునవ్వుతో “ వెడతావు”ఆ భక్తుడు తబ్బిబుతో “వెడతానా?” అన్నాడు
భగవాను అదే చిరునవ్వుతో మళ్ళీ చెప్పారు “ వెడతావు”“నేను నారాయణుని చూడకలుగుతానా?”“చూడగలవు”“నారాయణుడు నన్ను చూస్తాడా?”“చూస్తాడు!”“నాతో మాట్లాడుతాడా?”“మాటాలాడుతాడు”ఆ నారాయణుని పరమ భక్తుడు ఆనందంతో “చెప్పండి భగవాన్ నాతో నారాయణుడు ఏమని మాట్లాడుతాడు?” అన్నాడు ఉద్వేగంగా… సంతోషముతో వణుకుతూ
భగవాను అదే చిరునవ్వుతో “నారాయణడు నీవెవరవో ముందు తెలుసుకో ! అంటాడు” అన్నారు.
“ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం, శివం, అద్వైతం”
జగదంబా జడులైమైన మాకు పంచకోశ శుద్ధితో స్వాత్మను దర్శించుకునే శక్తి నీవే ఇవ్వగలవని అమ్మను ప్రార్థిస్తే ఎప్పటికైనా ఆలోచనలు మొదిటి స్థానమైన ఆత్మ దర్శనం కలుగకలదు కదా!