అష్టావక్రగీత #2
జనకుడు రాజయోగి. ఆయనకు జ్ఞాని అని పేరు. ఆయన అష్టావక్రుడన్న మునికుమారుని అడిగిన ప్రశ్న “జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం ఎలా నిలుపుకోవాలి? ముక్తి ఎలా లభ్యమవుతుంది?”
అష్టావక్రగీతలో మొదటి అధ్యాయములోని 19 శ్లోకాలాలో సమాధానం చెబుతాడు అష్టావక్రుడు.
ఆలోచించండి వేల సంవత్సరాలకు పూర్వం శంకరభగవద్పాదుల వారు మనకు అద్వైత జ్ఞానము పంచక పూర్వం అజ్ఞానమన్న రెల్లగడ్డిని పదునైన కత్తి వంటి సమాధానాలతో అష్టావక్రుడు చెప్పాడంటే….ఆనాటి మునుల జ్ఞానగంగా ప్రవాహం మన బుర్రకు అందనిది. అదీ సనాతనధర్మం ప్రపంచానికి ఇచ్చింది.
సరే ఆ తరువాత ఆ జ్ఞానమే మనకు ఎన్నింట్లోనో కనపడుతుంది అనికోండి.
ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను… “స్వర్గం-నరకం” తప్ప మోక్షమన్నది తెలియని పశ్చిమదేశవాసుకలకు జ్ఞానం పంచాలన్న ఆదర్శవంతమైన కోరికతో 20 వ శతాబ్ధంలో పరమహంస యోగానంద అమెరికా వచ్చి, మెదడు కాదు, వెన్నెముక అడుగు నుంచి, శిరస్సు వరకూ వ్యాపించిన చక్రల మీద ధ్యాస పెట్టి ధాన్యం చెయ్యమంటే పశ్చిమప్రపంచం విసుపోయింది. వారికి అదో పెద్ద కరెంటుషాకు.
అదీ మన ధర్మం యొక్క పదును. అది తెలుసుకునే జ్ఞానము కూడా నిండుకున్నదీనాడు.
అష్టావక్రడు కూడా తన పదునైన సమాధానాలతో అజ్ఞానం పండిన వారికి కరెంటుషాకు ఇస్తాడు.
ఆ పన్నెండు సంవత్సరాల యువ/బాల మునికుమారుడు జ్ఞానముతో పండి ఇంతింతై అన్నట్లుగా పెరిగి వ్యోమకేశునిలా సర్వం వ్యాపిస్తాడనిపిస్తుంది ఈ గీత చదివితే.
ఆయన రూపు అష్ట వంకర్లతే ఏమి? ఆకలి తీర్చుకోలేని పేదరికమయితేనేమి? కౌపీనం తప్ప మరో వస్త్రం లేకపోతేనేమి? ఆయనిచ్చిన జ్ఞానానికి మనమేమిచ్చి ఋణం తీర్చుకోగలమండి?
మనము జీవన్ముక్తులుగా చెయ్య పరమాత్మ బహుశా ఆ రూపంలో వచ్చాడేమో.
సరే మరి ఆయన సమాధానాలు చుద్దామా…
“ముక్తిమిచ్ఛసి చేత్తాత! విషయాన్విషవత్త్యజ।
క్షమార్జవ దయా తోష పీయూషవద్భజ॥”
ముక్తి కావాలనుకుంటే విషయలంపటాలను కాలకూటవిషంలా వదిలెయ్యాలి.
“కొద్దిగా రుచి చూసి వదిలేస్తాను విషాన్ని” అంటామా?
విషమని తెలియగానే టక్కని వదిలేస్తాము కదా.
ప్రపంచములో ఉన్న విషయ లంపటాలను ఇంద్రియాలు గ్రోలుతుంటాయి.
ఆపమంటే ఆపవు.
కాని అవి అధోగతి తప్ప మరో మార్గం చూపవు. రుచి, చూపు, వినుట, వాసన, స్పర్ష అన్న ఈ ఐదు ఇంద్రియ జ్ఞానాలు ఐదు ఉచ్చులు. మానవులను లాగి లంపటంలో తద్వారా జననమరణ చట్రం పడవేసే విషాలు. విషాన్ని వదిలినట్లుగా (విషయాన్విషవత్త్యజ) లంపటాల మీద మోహం వదిలెయ్యాలి.
తదనంతరం క్షమ, దయ, సత్యం పలుకుట, బుజు వర్తన, ఇతరులను మోసం చెయ్యకపోవటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటము వంటి సత్పవర్తన అలవాటు చేసుకోవాలి.
అజ్ఞానమే అన్ని రుగ్మతలకూ కారణం. అజ్ఞానం వలన ఈ శరీరము శాశ్వతమని తలుస్తాము. చూస్తున్న దానిలో మమైక్యమవుతాము. బంధాలను పెంచుకుంటాము. కోరికలు ఆకాశానికి, అవి తీర్చుకోవటానికి జన్మంతా గానుగఎద్దులా తిరుగుతూ ఉంటాము.
ఈ అజ్ఞాన్నానికి త్రుంచాలంటే జ్ఞానమన్న వెలుగు కావాలి.
దీని కోసమే ముందు ప్రపంచ మోహాల మీద నుంచి దృష్టిని తీసెయ్యాలి.
వాటిని విషంగా వదిలెయ్యాలి. జీవించటానికి ఏవీ ముఖ్యమైనవి కావు.
“జ్ఞానేన ఏవం కైవల్యం” జ్ఞానమొక్కటే కైవల్యాన్ని ప్రసాదిస్తుంది.
మంచి ప్రవర్తనను సాధన చెయ్యాలి.
ముక్తి మాత్రమే కావాలి మనకు, అన్యం వద్దు.
ముక్తి అంటే బంధాల నుంచి విముక్తి.
ముక్తి కావాలనుకునే వారికి జ్ఞానము మాత్రమే సహయం చెయ్యగలదు.
ఈ జ్ఞానము వల్లనే ఒకరు వైరాగ్యం పొంది, ఆ వైరాగ్యంలో ఉండగలరు. వైరాగ్యాని ఉంచుకోగలరు. వైరాగ్యం ఉంచుకోవాలంటే ఆ వస్తువు లేదా విషయంలో ఉన్న అసత్యం గ్రహించాలి.
కేవలం వస్తువు యొక్క లక్షణం వలన అది బ్రహ్మం చూడబడనీయ్యదన్న జ్ఞాన్నాని ఉంచుకోవాలి. అంటే ఏదైనా కోరిక కలిగిన తరువాత అది తీర్చుకోవటానికి తంటాలు పడి, తీరిన తరువాత మరో పది కోరికలు మనస్సులో తయారుగా ఉంటాయి. కారు కొనాలనుకుంటే దాని కోసం తంటా పడ్డాక కొన్న తరువాత నెలనెలా అప్పు తీర్చుకోవటమే సరిపోతుంది. కారు వాడుకలో పాడవుతుంది కానిఅప్పు అలాగే ఉంటుంది. ఇలాంటివెన్నో…
క్షణికానందాలు క్షుద్రమైనవి. అవి సాధకుని పడవేస్తాయి.
అతినిద్రా, క్షణికానందాలు విషంలా పరిత్యదించమన్నాడు అష్టావక్రుడు.
ప్రశాంతంగా ఉన్న చిత్తం జ్ఞాన్నాని పొందటానికి అనుకాలమైన స్థితిలో ఉంటుంది.
అంటే ముందు విషయ లంపటాలాను విషంలా వదిలేసి, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం వల్ల వైరాగ్యం నిలబడుతుంది.
3. “న ఫృథ్వీ న జలం న అగ్నిర్నవాయుర్ద్యార్నవా భవాన్।
ఏషాం సాక్షిణ మాత్మానాం చిద్రూపం విద్ధిముక్తయే॥
వైరాగ్యం పొందటానికి అర్హత ఏమిటి? మాములు జీవితంలో ఉద్యోగాలకు అర్హత ఏమిటి అని చూసుకుంటారుగా.
మరి వైరాగ్యాని పొందటానికి అర్హత ఉందా? అది ఎవరికంటే వారికి రాదా?
రాదు. జీవితం నిజమని… చుట్టు ఉన్న వస్తు లోకంలో (ర్యాట్‌రేసులో)
పరుగుపందెలో పోటి పడుతున్నవారికీ అదే జీవితమన్న, ఆ గెలుపుపోరాటములే జీవితమన్న వారికి వైరాగ్యానికి అర్హత లేదు.
ఎప్పుడైతే ఈ లంపటాల మీద బ్రాంతి వదిలేస్తాడో అప్పుడు అర్హత సంపాదిస్తాడు. అప్పుడు అతనికి(అలా వదిలేసినవాడికి) ఆత్మజ్ఞానం అందిచబడుతుంది.
సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. గొడుగు క్రింద ఉంటే ఎండ తగులుతుందా? విషయాలపై మోహం అన్న గొడుగు క్రిందఉన్నవారికి కూడా ఎండ అన్న జ్ఞానము తగలదు.
ఆ జ్ఞానమేమంటే, “నేను” అన్నది ఈ శరీరం కాదు.
కంటికి కనిపిస్తున్న పంచభూతాలు నీవు కావు. అష్టావక్రుడు నేరుగా జ్ఞాన్నాని ఇస్తున్నాడని అనుకున్నాముగా.
ఇక్కడ చెబుతున్నాడు- కనపడుతున్న పంచభూతాలు నీవు కావు. పంచభూతాల నుంచి మానవుని శరీరంలో పంచ భూతాల అంశాలు ఆకాశం వలన శబ్ధం, చెవి
వాయువు వలన గంధం, ముక్కు
అగ్ని వలన చూడటం కన్ను
జలం వలన రసం/రుచి, నాలుక
భూమి వలన స్పర్శ , చర్మం ఇలా పంచేద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి. పంచకోశాలు ఉన్నాయి. ఇవేమీ నేను కాదు. మనోబుద్ది అహంకారం సత్వ తమ రజో గుణాలు వచ్చాయి. అనీ నేను కాదు. మరి నేనెవరినంటే సాక్షీభూతంగా చూస్తున్న ఆత్మని అని చెప్పాడు ఇక్కడ.
అందుకే రమణులవారు ప్రతివారినీ “నేను ఎవరో తెలుసుకో” అని చెప్పేవారు.
అదే విషయం మనకు శంకరుల నిర్వాణ షట్కంలో చెబుతాడు “నచవ్యోమ భూమిర్ నతేజోనవాయుః చిదానందరూపం శివోహం శివోహం!!
ఉపనిషత్తులలో కూడా ఇదే చెప్పబడింది.
కాబట్టి అష్టావక్రుడు చెబుతున్నాడు దేహం నేనన్న బ్రాంతి మాను యని. బంధాల నుంచి విడుదల కమ్మని చెప్పాడు.
ఆ బంధాలేమిటో తరువాత చుద్దాం.
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి
(మిగిలినది రేపు)