అష్టావక్రగీత#3
వైరాగ్యం ఎలా కలుగుతుంది? జ్ఞానము ఎలా కలుగుతుంది? ముక్తి ఎలా కలుగుతుందని జనకమహారాజు ప్రశ్నించగా అష్టావక్రుడు సమాధానం చెబుతున్నాడు.
విషయలంపటాలను విషంలా వదిలెయ్యమన్నాడు. బంధాలనుంచి విడుదల చేసుకోమన్నాడు.
ఏ బంధాలవి?
“యదిదేహం పృథక్కృత్య చితి విశ్రామ్యతిష్టసి।
అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి॥”
శరీరము నేనన్న తాదాత్మ్యం నుంచి వేరుపడి నీ ఎరుకలో నీ కాంషియస్‌నెస్‌లో నిలబడి నిన్ను నీవు చూసుకు. నిత్యముక్తుడవు.నిత్యతృప్తుడవు. ఆనందరూపమే నీవు.
దేహమనేది ఒక పెద్ద బంధం. ఈ దేహము నేను అన్న ఆలోచనతో దేహాన్ని చూసుకొని మురవటం శరీరము గురించి దుఃఖపడటం చెస్తున్నారు నరులు. ఆ శరీరం పంచభూతాత్మకమైనది. కరిగిపోతుంది. కాని ఆత్మ నిలచి ఉంటుంది. కాబట్టి శరీరము మీద వ్యామోహం వదుల.ము ముందు బంధం నుంచి విడుదల.
సత్యం విప్రాదికో వర్ణోనాశ్రమీ నాక్షగోచరః
అసంగోసి నిరాకారఃవిశ్వసాక్షి సుఖాభవ॥
శరీరం అన్నది ఆత్మకు పైన ఉన్న తొడుగు మాత్రమే. లోన ఉన్న ఆత్మ మాత్రమే నిజతత్త్వం. ఆ ఆత్మకు ఏ వర్ణము లేదు. ఏ కులమతాలు లేవు. సంఘరహితుడు నిరాకారి, సర్వసాక్షి అయిన ఆత్మ నేను అయి ఉండగా ఇంకా దేనికి దుఃఖం?
సుఖపడమని చెబుతున్నాడు అష్టావక్రుడు.
తెర మీద సినిమా నడుస్తూ ఉంటుంది. సినిమాలో కష్టాలకు సినిమా తెర కన్నీరెట్టుకుంటుందా? లేక మాములుగా అలాగే ఉంటుందా? ఆ సినిమా తాలుకూ కష్టనష్టాలకు చెదరక ఎలా ఉంటుందో, అలాగే శరీరానికి జరిగే భావాలకు అతీతంగా ఆత్మ మసలుతూ ఉంటుంది. నీవు ఆత్మవేనప్పుడు, ఈ శరీరం నీది కానప్పుడు ఎందుకు దుఃఖం? సుఖమే నీ స్వరూపం.
ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతేవిభో
న కర్తాసి సం భోక్తా ముక్త ఏవాసి సర్వదా॥
ధర్మాధర్మ్లు, సుఖదుఃఖాలు మనస్సుకు సంబంధించినవి. ఆత్మకు అవి అంటవు.
ముక్త ఏవాసి సర్వదా. నీవు ఎప్పుడూ స్వతంత్రుడివి. దేనికి అంటకుండా సాక్ష్మీభూతంగా చూస్తుదే ఆత్మ. అందుకే బంధాలను వదిలించుకొని నీ అసలురూపం చూడు.
ఏకోద్రష్టాసి సర్వస్య ముక్తప్రాయో సి సర్వదా
అయమేవ హితే బన్దో! ద్రష్టారం పశ్యసీతరమ్॥
అన్నింటినీ చూస్తూ ఉన్న ఏకైక సాక్షివి నీవే. నీవు స్వతంత్రుడివి. ద్రష్టవు. నీవే కారణమని తలవటం బంధం.
చైతన్యమే నీవు అంటే మన చుట్టూ జరుగుతున్న ఈ వ్యాపారమేమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది.
అదంతా కూడా మాయే.
మనం గాఢనిద్రలో ఉంటాము. నిద్రలో మనకు కలలో అడవులో వెడుతుంటాము. అడవిలో ఎదురుగా పాము వస్తుంది. దాని చూడక తొక్కతాం. అది కాటు వేస్తుంది. మనం తన్నుకుంటు పడిపోతాం. వళ్ళంతా చెమటలు కారుతున్నాయి. ఆ సమయంలో మెలుకువ వస్తుంది.
హమ్మయ్యా!! కలే ఇది అనుకుంటాము. కలలో ఉన్నంత సేపూ మనకు మనము కలకంటున్నామని తెలియదు. ఆ క్షణములో అది నిజమని నమ్ముతున్నాము. లేచిన తరువాత ఆ కల మనస్సులో లయమవుతుంది.
జాగృత్ లోకంలో కరిగిపోవు. కానీ ఇదీ కల వంటిదే. ఎప్పుడైతే నిజ ్వరూపమైన ఆత్మను చూడగలమో ఆ క్షణంలో ఇదంతా కలయని తెలుస్తుంది. అందుకే “జగం మిథ్య- బ్రహ్మసత్యం” అన్నారు. చుట్టూ ఉన్నవి నిజమనుకున్నంత కాలమూ నిద్రావస్థలో ఉన్నట్లే. ఎప్పుడైతే ఇందతా కూడా మాయ అని తెలిసిందో అప్పుడు ఆత్మ స్వరూపం తెలిసి ఈ మాయనుంచి విడుదల సంభవిస్తుంది.
Sent from my iPad